చికెన్ బ్రెస్ట్ తింటే కలిగే లాభాలివే తెలుసా..?


Tue,November 13, 2018 03:41 PM

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఇష్టంగా తినే మాంసాహారాల్లో చికెన్ ప్రథమ స్థానంలో నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇక భారత్ విషయానికి వస్తే ఇక్కడ చికెన్ ప్రియులు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే చాలా మంది చికెన్‌ను చాలా రకాలుగా వండుకుని తింటారు. కొందరికి చికెన్ లెగ్స్ అంటే ఇష్టం ఉంటుంది. కొందరికి మరొక భాగం అంటే ఇష్టం ఉంటుంది. ఇక కొందరు కేవలం చికెన్ బ్రెస్ట్ మాత్రమే తింటారు. అయితే నిజానికి మనం చికెన్ బ్రెస్ట్ తింటేనే అధికంగా లాభం ఉంటుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మరి చికెన్ బ్రెస్ట్ తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. చికెన్ బ్రెస్ట్‌లో క్యాలరీలు మనకు అధికంగా లభిస్తాయి. అలాగే విటమిన్ ఇ, బి6, బి12 వంటి పోషకాలు కూడా మనకు చికెన్ బ్రెస్ట్‌తో లభిస్తాయి. వీటితోపాటు ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియంలు కూడా చికెన్ బ్రెస్ట్‌లో ఉంటాయి. కనుక ఈ పోషకాలు కావాలనుకునేవారు.. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం ఉన్నవారు చికెన్ బ్రెస్ట్ తినడం మంచిది.

2. వంద గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో 18 గ్రాముల వరకు మనకు పోషకాలు లభిస్తాయి. వీటి వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. శరీరానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి.

3. చికెన్ బ్రెస్ట్‌లో ఉండే మినరల్స్ మనకు చర్మ సమస్యలు రాకుండా చూస్తుంది. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నరాల బలహీనత పోతుంది.

4. చికెన్ తినడం వల్ల కొలెస్ట్రాల్ చేరుతుందని అనుకుంటారు. అందులో నిజం లేదు. మటన్ కన్నా చికెన్ తినడం ఎంతో శ్రేయస్కరం. అందులో మటన్ కన్నా కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునేవారు కూడా ఎలాంటి భయం లేకుండా చికెన్ బ్రెస్ట్ తినవచ్చు.

5. చికెన్ బ్రెస్ట్‌ను తరచూ తినే వారిలో హైబీపీ అదుపులో ఉంటుందని పరిశోధనలే చెబుతున్నాయి. అలాగే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయట. దీంతోపాటు ఒత్తిడి కూడా దూరమవుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.

3886

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles