మీకు ఊలాంగ్ టీ తెలుసా..? ఆ టీ తాగితే క‌లిగే లాభాలివే..!

Thu,January 3, 2019 05:34 PM

చైనా, తైవాన్‌ల‌లో పురాత‌న కాలం నుంచి ప్ర‌జ‌లు ఊలాంగ్ టీని సేవిస్తున్నారు. ప్రాసెస్ చేయ‌బ‌డిన గ్రీన్‌, బ్లాక్ టీ ల మిశ్ర‌మాన్ని ఊలాంగ్ టీ అంటారు. ప్ర‌స్తుతం మన ద‌గ్గ‌ర కూడా ఈ టీ ల‌భిస్తున్న‌ది. ఇందులో జాస్మిన్‌, కొబ్బ‌రి, క్యార‌మెల్ వంటి ఇతర ఫ్లేవ‌ర్స్ కూడా మ‌నకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇత‌ర టీల క‌న్నా ఊలాంగ్ టీని తాగితే మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. ఊలాంగ్ టీలో ఇత‌ర టీల‌లో క‌న్నా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల‌ నుంచి ర‌క్షిస్తాయి.

2. ఊలాంగ్ టీలో విట‌మిన్ ఎ, బి కాంప్లెక్స్ విట‌మిన్లు, విట‌మిన్ సి, ఇ, కెల‌తోపాటు ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, మాంగ‌నీస్‌, కాప‌ర్‌, సెలినియం, పొటాషియం త‌దిత‌ర పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి పోష‌ణ‌ను ఇస్తాయి.

3. నిత్యం ఊలాంగ్ టీని రెండు, మూడు ద‌ఫాల్లో మొత్తంగా కలిపి 300 ఎంఎల్ వ‌ర‌కు సేవిస్తే కొవ్వు అధికంగా క‌రుగుతుంద‌ని సైంటిస్టుల చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో తేలింది. ఊలాంగ్ టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. తద్వారా క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. బ‌రువు త‌గ్గుతారు.

4. ఊలాంగ్ టీ తాగ‌డం వ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంతత క‌లుగుతుంది. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డవ‌చ్చు.

5. ఈ టీ తాగితే శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

4248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles