రేగిపండ్లతో బోలెడు లాభాలు..!


Sat,December 8, 2018 04:54 PM

రేగిపండ్లలో అనేక రకాలు ఉంటాయి. చిన్నవి, పెద్దవి వివిధ రకాల రుచులను కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే రేగి పండ్లంటే ఎవరైనా ఇష్టంగానే తింటారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో రేగిపండ్లు ఎక్కువగా మనకు లభిస్తాయి. అందువల్ల వీటిని ఈ సీజన్‌లో తింటే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రేగిపండ్లలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి, కంటి చూపు పెరుగుతాయి. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. రేగిపండ్లను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండెకు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

3. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రేగి పండ్లను తింటే త్వరగా ఆకలి కాదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. తద్వారా బరువు తగ్గించుకోవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు రేగి పండ్లను తింటే మంచిది. వీటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

4. రేగిపండ్లలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.

5. రేగిపండ్లను తినడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మం పగలకుండా ఉంటుంది.

7366

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles