అధిక బరువు తగ్గాలంటే.. రోజూ ఈ పండ్లు తినాలి..!


Thu,October 25, 2018 06:01 PM

ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలంటే ఎవరైనా పౌష్టికాహారం తీసుకోవాల్సిందే. అన్ని పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటేనే మన శరీరానికి పోషణ లభిస్తుంది. ముఖ్యంగా తాజా కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే వాటి ద్వారా మనకు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీంతోపాటు అనేక విటమిన్లు, మినరల్స్ కూడా మనకు లభిస్తాయి. అయితే మనకు అందుబాటులో ఉన్న పలు పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలను కూడా రాకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు బరువు కూడా తగ్గుతారు. ఈ క్రమంలోనే బరువు తగ్గాలంటే ఏయే పండ్లను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బ్లాక్‌బెర్రీలు, క్రాన్‌బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు.. ఇలా బెర్రీలలో రకరకాల పండ్లు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఫైబర్ మనకు పుష్కలంగా లభిస్తుంది. దీంతోపాటు తక్కువ క్యాలరీలు మాత్రమే వస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్యాల బారి నుంచి తప్పించుకోవచ్చు. దీంతోపాటు కొవ్వు కూడా కరిగి అధిక బరువు తగ్గుతారు.

2. యాపిల్ మనకు అందుబాటులో ఉన్న సూపర్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. బరువు తగ్గించుకునేందుకు ఈ పండు మనకు ఎంతగానో మేలు చేస్తుంది. యాపిల్ పండ్లలో డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించుకునేందుకు సహాయం చేస్తాయి. యాపిల్ పండ్లను రోజూ తింటే బరువు తగ్గించుకోవచ్చు. దీంతోపాటు గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

3. పుచ్చకాయలు ఈ సీజన్ కావు. కానీ ఇవి అప్పుడప్పుడు మనకు మార్కెట్‌లో లభిస్తూనే ఉంటాయి. వీటిని తినడం వల్ల క్యాలరీలు చాలా తక్కువగా వస్తాయి. దీంతోపాటు ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు.

4. నారింజ పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్యాల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి.

5. జామ పండ్లు మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఇవి ధర కూడా అంతగా ఉండవు. కనుక వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఫైబర్ పుష్కలంగా అందుతుంది. దీనికి తోడు అధిక బరువు కూడా తగ్గవచ్చు. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

7904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles