గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Feb 10, 2020 , 12:05:10

ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే.. నిత్యం వీటిని తీసుకోవాలి..!

 ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే.. నిత్యం వీటిని తీసుకోవాలి..!

నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిత్యం ఏమేం ఆహారాల‌ను తింటున్నారో కూడా స‌రిగ్గా గ‌మ‌నించ‌డం లేదు. కంటికి క‌న‌ప‌డే జంక్ ఫుడ్‌ను ఎక్కువ‌గా లాగించేస్తున్నారు. దీంతో దీర్ఘ‌కాలంలో అనారోగ్య స‌మ‌స్య‌లను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే.. కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. మ‌రి ఆరోగ్యం కోసం నిత్యం తినాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1. గ్రీన్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీన్ని నిత్యం తీసుకుంటే చాలా వ‌ర‌కు అనారోగ్య స‌మ‌స్యలు రాకుండా చూసుకోవ‌చ్చు.

2. బాదంప‌ప్పుల‌ను కూడా నిత్యం తినాలి. వీటి వ‌ల్ల మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.

3. బ్లూబెర్రీల‌ను కూడా నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి విట‌మిన్ సి, ఫైబ‌ర్‌లు స‌రిగ్గా అందుతాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు.

4. క్యాప్సికంను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే.. క్యాన్స‌ర్, డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవ‌చ్చు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

5. నిత్యం పెరుగు, యాపిల్స్‌, పాల‌కూర‌, కోడిగుడ్లను కూడా తినాలి. దీంతో శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ల‌భిస్తాయి. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.


logo