రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!


Wed,August 22, 2018 12:13 PM

మన శరీరానికి ఏదైనా ప్రదేశంలో గాయం అయినప్పుడు వెంటనే రక్తస్రావం అవుతుంది. అయితే రక్తస్రావాన్ని అరికట్టేందుకు శరీరం తనకు తానుగా రక్తం గడ్డ కట్టే ప్రక్రియను ప్రారంభిస్తుంది. దీంతో రక్త ఎక్కువగా పోకుండా ఉంటుంది. అయితే కొందరికి పలు కారణాల వల్ల శరీరంలో రక్త నాళాల్లో రక్తం గడ్డ కడుతూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని సార్లు ఈ క్లాట్స్ వాటంతట అవే పోతాయి. కానీ కొన్ని మాత్రం ఇబ్బందులకు గురి చేస్తాయి. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. అదే గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు దగ్గర్లో ఉండే రక్తనాళాల్లో రక్తం గడ్డ కడితే అది ప్రాణాంతకమవుతుంది. అయితే కింద సూచించిన పలు ఆహారాలను నిత్యం తీసుకుంటే అలాంటి క్లాట్స్ ను కరిగించవచ్చు. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. మరి రక్త సరఫరాను పెంపొందిస్తూ క్లాట్స్‌ను నివారించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. అల్లం

నిత్యం ఉదయాన్నే పరగడుపునే అల్లం రసం సేవించాలి. లేదంటే అల్పాహారం తరువాత తాగే టీలోనూ అల్లం వేసి తాగవచ్చు. ఇలా అల్లం రసం రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రక్త పలుచగా తయారవుతుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

2. కారం

అప్పుడప్పుడు ఎండు కారంను ఆహారంలో కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఎండు మిరపకాయల్లో ఉండే సాలిసిలేట్స్ అనబడే పదార్థం రక్తాన్ని పలుచగా చేస్తుంది. అందువల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

3. చేపలు

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. క్లాట్స్ ఏర్పడకుండా చూస్తాయి. చేపలను వారంలో కనీసం రెండు మూడు సార్లు తింటే ఫలితం ఉంటుంది.

4. రెడ్ వైన్

రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగితే గుండె జబ్బులు రావని అధ్యయనాలు చెబుతున్నాయి. రెడ్ వైన్‌లో రక్తాన్ని పలుచగా చేసే గుణాలు ఉంటాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

5. దాల్చినచెక్క

దాల్చినచెక్కను నిత్యం టీలో వేసుకుని తాగాలి. లేదా తేనెతో అయినా తీసుకోవచ్చు. దాల్చిన చెక్కలో యాంటీ కాగులెంట్ గుణాలు ఉంటాయి. అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

2978

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles