ఆక‌లితో అడ్డూ అదుపూ లేకుండా తింటున్నారా..? ఆక‌లిని ఇలా నియంత్రించండి..!

Thu,May 16, 2019 12:28 PM

మ‌న‌కు ఆక‌లి అయితేనే ఆహారం తీసుకుంటామ‌నే సంగ‌తి తెలిసిందే. ఆక‌లి బాగా అయితే ఎక్కువ ఆహారం తింటాం. అయితే కొంద‌రికి ఎప్పుడూ ఆక‌లి అవుతూనే ఉంటుంది. దీంతో వారు ఆహారాన్ని అధికంగా తీసుకుంటుంటారు. ఈ క్ర‌మంలో అలాంటి వారు బ‌రువు కూడా పెరుగుతుంటారు. అయితే ఆక‌లిని నియంత్రిస్తే మ‌నం బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లిని నియంత్రించ‌వ‌చ్చు. పైగా మ‌న శ‌రీరానికి పోష‌ణ కూడా ల‌భిస్తుంది. మ‌రి ఆక‌లిని నియంత్రించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే బీన్స్, ప‌చ్చి బ‌ఠానీలు, శ‌న‌గ‌లు, తృణ ధాన్యాలు త‌దిత‌ర ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. అలాగే ఎక్కువ స‌మ‌యం పాటు ఉన్నా ఆక‌లి కాకుండా ఉంటుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోవ‌డం మానేస్తారు. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

2. కోడిగుడ్లు, సోయా ఉత్ప‌త్తులు, పెరుగు, ప‌ప్పు దినుసులు తదిత‌ర ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. బ‌రువు త‌గ్గుతారు.

3. అవ‌కాడో, ఆలివ్ ఆయిల్‌, కొబ్బరినూనెల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. త‌ద్వారా ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

4. భోజ‌నం చేసేముందు సూప్ తాగాలి. దీని వ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఫ‌లితంగా శ‌రీరంలో ఎక్కువ క్యాలరీలు చేర‌కుండా, కొవ్వు పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. అలాగే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

5. భోజ‌నానికి ముందు అల్లం ర‌సం తాగ‌డం, డార్క్ చాక్లెట్ తిన‌డం లేదా కాఫీ తాగ‌డం, త‌క్కువ ఆహారాన్ని ఎక్కువ సేపు తిన‌డం చేసినా ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

4584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles