పొట్ట దగ్గరి కొవ్వును కరిగించే 5 అద్భుతమైన ఆహారాలు..!

Thu,December 6, 2018 03:37 PM

బానపొట్ట ఉన్న ఎవరికైనా తాము అందవిహీనంగా ఉన్నామనే భావన కలగడం సహజం. అది వారికే కాదు, చూసేందుకు ఎదుటి వారికి కూడా అలాగే కనిపిస్తుంది. దీంతో బానపొట్టను తగ్గించుకునేందుకు అనేక మంది అనేక చిట్కాలను, పద్ధతులను పాటిస్తుంటారు. వాటన్నింటిని పక్కన బెట్టి కింద సూచించిన పలు ఆహారాలను తీసుకుంటే దాంతో పొట్ట దగ్గరి కొవ్వును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే...


1. ఉసిరి


ఉసిరికాయలు ఈ సీజన్‌లో మనకు బాగా లభిస్తాయి. వీటిని నిత్యం తీసుకుంటే అధిక బరువు సులభంగా తగ్గుతుంది. అలాగే పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. బరువు తగ్గించడంలో ఉసిరి అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఉసిరి కాయ రసాన్ని తాగితే ఫలితం ఉంటుంది.

2. జీలకర్ర


గుప్పెడు జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా చేసుకుని జీలకర్ర నీటిని రోజూ తాగాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. అధిక కొవ్వును కరిగిస్తుంది.

3. మెంతులు


మెంతులు ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు సహాయ పడుతాయి. రాత్రి పూట గుప్పెడు మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులను తినాలి. ప్రతి రోజూ పరగడుపునే ఇలా చేస్తే చాలా త్వరగా కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.

4. దాల్చినచెక్క


మన శరీర మెటబాలిజాన్ని పెంచే గుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో కలిపి తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో దాల్చిన చెక్క అమోఘంగా పనిచేస్తుంది.

5. త్రిఫల చూర్ణం


నిత్యం రాత్రిపూట నిద్రించడానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగితే నెల రోజుల్లోనే పొట్ట దగ్గరి కొవ్వును పూర్తిగా తగ్గించుకోవచ్చు. త్రిఫల చూర్ణం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ ఉండదు.

7155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles