అల్లంను ఏయే సమస్యలున్నవారు తీసుకోకూడదంటే..?


Mon,November 12, 2018 02:43 PM

నిత్యం మనం అల్లంను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తుంటాం. అల్లం లేకుండా నాన్‌వెజ్ వంటలను ఎవరూ వండరు. అల్లం రసంను కొందరు తాగుతుంటారు. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇక కొందరికైతే అల్లం టీ ఫేవరెట్. అయితే అల్లం వల్ల మనకు అనేక లాభాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అల్లంను వాడరాదు. మరి ఏయే సమస్యలు ఉన్నవారు అల్లంను వాడవద్దో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. హెమోఫీలియా అనే వ్యాధితో బాధపడే వారు అల్లంను ఉపయోగించరాదు. ఈ వ్యాధి ఉన్న వారు అల్లంను తీసుకుంటే ఆ వ్యాధి కోసం ఇచ్చే మందులు పనిచేయవు. దీంతో రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడి ప్రాణాంతకమవుతుంది. అందుకే ఈ వ్యాధి ఉన్నవారు అల్లంను తీసుకోరాదు.

2. హైబీపీ, కొన్ని రకాల డయాబెటిస్ మెడిసిన్ వేసుకునేవారు అల్లంను తక్కువగా తీసుకోవాలి. లేదంటే మందులు సరిగ్గా పనిచేయవు.

3. అల్లం బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. కనుక ఉండాల్సిన బరువు కన్నా చాలా తక్కువగా బరువు ఉన్న వారు అల్లంను తక్కువగా తీసుకుంటే మంచిది.

4. గర్భంతో ఉన్న మహిళలు కూడా అల్లం ఉపయోగాన్ని తగ్గించాలి. లేదంటే.. బిడ్డ నెలలు నిండకుండానే పుట్టే ప్రమాదం ఉంటుంది. లేదంటే గర్భిణీలకు ఇతర సమస్యలు కూడా రావచ్చు. కనుక వారు అల్లంకు దూరంగా ఉండడమే బెటర్.

2031

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles