వాల్‌న‌ట్స్ ఆయిల్‌తో చ‌ర్మానికి క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!


Mon,February 19, 2018 02:34 PM

నేటి తరుణంలో అందం, చర్మ సౌందర్యంపై ప్రతి ఒక్కరు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి కావల్సిన విధంగా చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల పదార్థాలను వాడుతున్నారు. వాటిలో సహజ సిద్ధమైనవి చాలా తక్కువగానే ఉంటున్నాయి. అయితే అలాంటి సహజ సిద్ధమైన పదార్థాల్లో వాల్‌నట్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఇవి చర్మ సౌందర్యాన్ని చెప్పుకోదగిన రీతిలో పెంపొందిస్తాయి. వీటిలో అందాన్ని పెంచేందుకు ఉపయోగపడే విటమిన్ ఇ, విటమిన్ బి1, బి2, బి3, బి6, కాపర్, జింక్, కాల్షియం, మాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే చర్మానికి చక్కని సంరక్షణను అందించవచ్చు. ఈ నేపథ్యంలోనే వాల్‌నట్స్‌తో తయారుచేసిన ఆయిల్‌ను వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వాల్‌నట్ ఆయిల్‌ను చర్మంపై రాస్తే అది తేమనిచ్చే మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇది పొడి చర్మం కలిగిన వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధానంగా చేతులు, మోచేతులపై రాస్తే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఆయా ప్రాంతాల్లో ఉండి మురికి, జిడ్డు పోయి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

2. వాల్‌నట్ ఆయిల్ చర్మంపై వచ్చే ముడతలను నివారించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ఇది గ్రీజ్ మాదిరి పదార్థాలను కలిగి ఉంటుంది. ఈ ఆయిల్‌ను తరచూ చర్మంపై రాస్తే చారలు కూడా మాయమవుతాయి. ముడతలు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రాత్రి సమయంలో శరీరానికి రాసి ఉదయాన స్నానం చేస్తే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

3. జిడ్డు చర్మం కలిగిన వారు కూడా వాల్‌నట్ ఆయిల్‌ను నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. రోజూ సాయంత్రం వేళ వాల్‌నట్ ఆయిల్ రాసుకుని కొద్ది సేపు దాన్ని అలాగే ఉండనివ్వాలి. అనంతరం పొడి బట్టతో చర్మాన్ని శుభ్రం చేసి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. దీంతో చ‌ర్మానికి మృదుత్వం క‌లుగుతుంది.

4. మొటిమలు, నల్లని చార‌లు, కళ్ల కింద నల్లని వలయాలు తదితర సమస్యలు కూడా వాల్‌నట్స్ ఆయిల్‌తో దూరమవుతాయి. ఈ ఆయిల్‌ను వారానికి 3 సార్లు ముఖానికి రాస్తే ముందు చెప్పిన‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు చర్మం మృదుత్వాన్ని కూడా సంతరించుకుంటుంది.

2722

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles