బాదం పాలతో కలిగే అద్భుతమైన లాభాలివే..!


Thu,November 15, 2018 11:53 AM

బాదం పాలు మనకు మార్కెట్‌లో దొరుకుతాయి. అలాగే వాటిని మనం ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. బాదం పప్పును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో అంతకన్నా మించిన లాభాలే బాదం పాల వల్ల మనకు కలుగుతాయి. నిజానికి బాదం పప్పు కన్నా బాదం పాలే మనకు తేలిగ్గా జీర్ణమవుతాయి. దీంతోపాటు మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు బాదం పాల వల్ల మనకు లభిస్తాయి. ఈ క్రమంలోనే బాదం పాలను తరచూ తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బాదం పాలలో విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి. విటమిన్ ఇ కూడా అధికంగా ఉండడం వల్ల చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

2. బాదంపాలలో మన శరీరానికి పనికొచ్చే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను, హైబీపీని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.

3. డయాబెటిస్ ఉన్న వారు బాదం పాలను తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. దీని వల్ల శరీరంలో ఫ్యాట్ చేరదు. అలాగే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో బరువు తగ్గవచ్చు. అలాగే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది.

4. వ్యాయామం ఎక్కువగా చేసేవారు బాదంపాలను తాగితే కండరాల నిర్మాణం సరిగ్గా జరుగుతుంది. శరీరం చక్కని ఆకృతిని పొందుతుంది.

4217

More News

VIRAL NEWS