ముఖం కాంతింవంతంగా క‌నిపించాలంటే..?


Thu,November 15, 2018 10:26 AM

ముఖం ఎంత అందంగా ఉన్నా జిడ్డు కారుతుంటే.. అంద‌మైన ముఖం కాస్తా అంద విహీనంగా క‌నిపిస్తుంది. చాలా మందికి సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ముఖంపై ఎప్పుడూ నూనె అధికంగా స్ర‌విస్తూ ముఖం జిడ్డుగా క‌నిపిస్తుంది. అలాంటి వారు ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే ముఖాన్ని కాంతివంతంగా క‌నిపించేలా చేసుకోవ‌చ్చు. మ‌రి అలా ముఖం క‌నిపించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్‌మిల్‌ పొడిలో కోడిగుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ వాడుతుంటే చర్మం నిగారిస్తుంది.

2. ఆపిల్ పండ్ల‌ పై పొట్టును చాలా మంది పడేస్తుంటారు. అలా కాకుండా ఈ పొట్టును మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. దీనికి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముని వేళ్లతో ముఖంపై రాస్తూ.. ఐదు నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఆ తర్వాత మిగిలిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే.. జిడ్డు మాయం అవుతుంది.

3. ఒక స్పూన్‌ టమాటో గుజ్జులో అర స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

4. రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి, రెండు టీ స్పూన్ల రోజ్‌ వాటర్‌ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్‌తో ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి.

2769

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles