నిమ్మ‌కాయ తొక్క‌తో ఉప‌యోగాలు..!


Sat,December 1, 2018 08:01 PM

సాధార‌ణంగా ఎవ‌రైనా ఇండ్ల‌లో నిమ్మ‌కాయ‌ల‌ను వాడాక వాటిని ప‌డేస్తుంటారు. కానీ వాటితో నిజానికి ఎన్నో ఉపయోగాలుంటాయి. నిమ్మ‌కాయ తొక్క‌లు మ‌న‌కు ఏ విధంగా ప‌నికొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఇంట్లో పురుగులు, చీమలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తుంటే వంటింట్లో గోడలకున్న రంధ్రాల దగ్గర, కిటకీల వద్ద.. నిమ్మచెక్కలను ఉంచితే చాలు.. వాటి బెడద దూరమవుతుంది.

2. కిచెన్‌లో పాడైపోయిన కూరగాయలు, వంటల తాలూకు చెడు వాసన వస్తుంటే గిన్నె నిండా నీళ్లు నింపి అందులో ఈ చెక్కలను వేసి పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు మరిగాక వాటి నుంచి సువాసనలు వస్తాయి. ఇల్లంతా పరిమళభరితం అవుతుంది.

3. ఫ్రిజ్‌, ఓవెన్‌ నుంచి దుర్వాసనలు వస్తుంటే.. చిన్న కప్పులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయ ముక్క ఉంచితే సమస్యలు తక్షణమే దూరమైపోతాయి.

4. పొయ్యి, బాణలి, పెనం వంటి వాటి మీద ఉప్పు చల్లి ఈ చెక్కతో రుద్ది కడగాలి. తరవాత పొడి వస్త్రంతో తుడిస్తే నూనె మరకలు వదిలిపోతాయి.

8424

More News

VIRAL NEWS