కరివేపాకుతో కలిగే లాభాలు తెలుసా..?


Sat,November 17, 2018 02:36 PM

భారతీయులు నిత్యం చేసుకునే వంటల్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కొందరు కరివేపాకును ఇష్టంగా తింటారు. కానీ కొందరు మాత్రం కూరల్లో వేశాం కదా అని చెప్పి వాటిని భోజనం చేసేటప్పుడు తీసేస్తారు. అయితే కరివేపాకు ఉపయోగాలు తెలిస్తే ఎవరూ ఆ ఆకులను ఇకపై పడేయరు. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కరివేపాకులో ఉన్నాయి. కరివేపాకు వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కరివేపాకులో మన శరీరానికి ఎంతో ముఖ్యమైన కాల్షియం, పాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్, కెరోటిన్, ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్థాలు, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి కరివేపాకు వల్ల చక్కని పోషణ లభిస్తుంది. ఈ ఆకును నిత్యం ఏ రూపంలో తీసుకున్నా సరే పైన చెప్పిన పోషకాలు అన్నీ అందుతాయి. తద్వారా పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

2. నిత్యం ఉదయాన్నే పరగడుపునే 10 కరివేప ఆకులను అలాగే పచ్చివే నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.

3. కరివేపాకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని అన్నంలో మొదటి ముద్దగా కలుపుకు తింటే అజీర్తి తగ్గిపోతుంది. ఆకలి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే కరివేపాకులకు మెంతులు, మిరియాలు కూడా కలిపి పొడి చేసి తీసుకుంటే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది.

4. మజ్జిగలో కొంత కరివేప ఆకుల రసం కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. కొబ్బరినూనెలో కొద్దిగా కరివేపాకు పేస్ట్ వేసి బాగా మరగబెట్టి అనంతరం వచే ద్రవాన్ని వడబోసి వెంట్రులకు రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడతాయి. జుట్టు సమస్యలు పోతాయి.

6292

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles