కంటి చూపు మెరుగు ప‌డాలంటే..?


Wed,October 31, 2018 10:30 AM

నేటి తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కంటి చూపు సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందికి దృష్టి లోపం సమస్య వస్తున్నది. దీంతో చిన్న వయస్సు నుంచే కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లను ధరించాల్సి వస్తున్నది. అయితే అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్నా, కంటి చూపు మెరుగు పడాలన్నా కింద సూచించిన పలు ఆహారాలను తరచూ తీసుకోవాలి. దీంతో దృష్టి లోపం సమస్యను అధిగమించవచ్చు. మరి అందుకు నిత్యం మనం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బాదంపప్పు


వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దృష్టి సమస్యలను పోగొడతాయి. చూపు మెరుగయ్యేలా చేస్తాయి. నిత్యం గుప్పెడు బాదం పప్పును నీటిలో నానబెట్టి పొట్టు తీసి తినాలి. దీంతో నేత్ర సమస్యలు పోతాయి.

2. సోంపు గింజలు


చాలా మంది సోంపు గింజలను భోజనం చేశాక నోటికి తాజాదానం అందించడం కోసమో లేదా తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు సోంపును వేసుకుంటారు. కానీ సోంపు వల్ల కంటి సమస్యలు కూడా పోతాయి. అందుకు ఏం చేయాలంటే... ఒక కప్పు బాదం పప్పు, సోంపు గింజలు, కొద్దిగా చక్కెర తీసుకుని అన్నింటినీ కలిపి పొడి చేయాలి. ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని రాత్రి పూట నిద్రించేందుకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తాగాలి. ఇలా రోజూ తాగితే కొద్ది రోజుల్లోనే కంటి చూపు మెరుగవుతుంది.

3. ఉసిరి


ఉసిరికాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. కనుబొమ్మ లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలు తయారయ్యేలా చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్‌ను కలుపుకుని రోజూ ఉదయం, సాయంత్రం తాగితే నేత్ర సమస్యలు పోతాయి. అవసరం అనుకుంటే తేనెను కూడా ఈ మిశ్రమంలో కలుపుకుని సేవించవచ్చు.

4. పౌష్టికాహారం

విటమిన్ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్స్, యాపిల్స్, పాలకూర, బీట్‌రూట్, బ్రొకోలి, కోడిగుడ్లు తదితర ఆహారాలను రోజూ తీసుకుంటే దృష్టి లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.

3937

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles