గులాబీ పూల‌తో చ‌ర్మ సౌంద‌ర్యం..!


Mon,November 19, 2018 03:42 PM

సువాస‌న‌ల‌ను వెద‌జ‌ల్లే గులాబీ పూల‌ను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. యువ‌తులకైతే గులాబీ పూలంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే అందంతో పాటు, సౌందర్య సాధనంగా కూడా గులాబీలు ఉపయోగపడతాయి. వీటితో చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఈ పూలు చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ముఖ తేజస్సు పెరగాలంటే పది గులాబీ రేకులను నీళ్లలో గంటపాటు నానబెట్టి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీనికి రెండు టీ స్పూన్ల రోజ్ వాట‌ర్‌, మూడు టీ స్పూన్ల తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పావు గంట ప్రిజ్‌లో ఉంచాక వేళ్లతో ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రాయాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

2. గులాబీ పువ్వులు పొడిబారిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా కూడా ఉపయోగపడతాయి. అందుకోసం.. పది గులాబీ రేకులను మెత్తగా చేసి, అందులో రెండు చెంచాల రోజ్ వాట‌ర్‌, రెండు చెంచాల తేనె, మూడు చుక్కల బాదం నూనె వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖంపై వలయాకారంగా రాస్తూ పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.

3. ఎనిమిది గులాబీ రేకులను మెత్తగా చేసి అందులో రెండు చెంచాల రోజ్ వాట‌ర్‌, చెంచా పెరుగు, చెంచా తేనె వేసి కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

4. పది గులాబీ రేకులు, పది పుదీనా ఆకుల్ని మెత్తని మిశ్రమంలా చేయాలి. దీనికి చెంచా రోజ్ వాట‌ర్‌, గుడ్డులోని తెల్లసొన, చెంచా మొక్కజొన్న పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ముడతలు త‌గ్గిపోతాయి.

1236

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles