ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - May 14, 2020 , 13:39:16

ఆయుర్వేద ఔషధ పరీక్షలకు ఇదే అదను

ఆయుర్వేద ఔషధ పరీక్షలకు ఇదే అదను

న్యూఢిల్లీ: కరోనాకు ఇప్పటిదాకా చికిత్స లేదు. అందుకే అందుబాటులో ఉన్న అన్నిరకాల మందులను పరీక్షిస్తున్నారు. తాజాగా ఆయుష్ మంత్రిత్వశాఖ సీఎస్ఐఆర్‌తో కలిసి నాలుగు రకాల ఆయుర్వేద మందులపై ప్రత్యక్ష అధ్యయనాలు మొదలుపెట్టింది. మూడు మాసాల్లో ఈ అధ్యయనాల ఫలితాలు వస్తాయని అంటున్నారు. వారం రోజుల్లో కరోనా రోగులకు వీటిని ఇచ్చిచూస్తారు. ఆయుష్ శాఖమంత్రి శ్రీపాద్ నాయక్ ఈ సంగతి వెల్లడించారు. కరోనా కల్లోలాన్ని అధిగమించడంలో మన సాంప్రదాయిక వైద్యం ఉపకరిస్తుందని ఆయన ట్విట్టర్‌లో  ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఇది జీవితకాలంలో ఒకసారి వచ్చే అవకాశం.. ఇలాంటి అధ్యయనం మనదేసంలో ఇంతకు ముందెన్నడూ జరుగలేదు. అశ్వగంధ, యష్టిమధు, గుడుచి పిప్పలి (గిలోయ్), మలేరియా కోసం అభివృద్ధి చేసిన ఆయుష్-64 మందులను ఈ అధ్యయనాల్లో పరీక్షించబోతున్నాం' అని ఆయుర్వేద, ఆయుష్ విభాగం కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా చెప్పారు. అధిక ముప్పును ఎదుర్కొనేవారికి నివారిణిగా అశ్వగంధ ఇచ్చిచూస్తారని, హైడ్రాక్సీక్లోరోక్విన్, అశ్వగంధ మధ్య తులనాత్మక అధ్యయనం కూడా ఉంటుందని వివరించారు. అదనపు ఔషధాలుగా, ప్రామామిక చికిత్సలో భాగంగా పై నాలుగు ఔషధాలను ఇస్తారని ఆయన చెప్పారు. వేల సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్న ఆయుర్వేద ఔషధాల పనితీరును గమనించేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుందని సీఎస్ఐఆర్ డరెక్టర్ జనరల్ శేఖర్ మందే అన్నారు. చైనా తన సంప్రదాయిక ఔషధాల ప్రభావాన్ని పరీక్షించి చాటుకోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.

తాజావార్తలు


logo