టైప్ 2 డ‌యాబెటిస్‌ను నియంత్రించే అద్భుత‌మైన ఆహారాలు..!


Thu,May 2, 2019 11:54 AM

నేటి త‌రుణంలో ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్ బారిన పడుతున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం 50 ఏళ్లు పైబ‌డిన వారికే టైప్ 2 డ‌యాబెటిస్ వచ్చేది. కానీ ఇప్పుడు యువ‌త కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. అస్త‌వ్యస్త‌మైన జీవ‌న విధానం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, స్థూల‌కాయం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తున్న‌ది. అయితే ఈ వ్యాధి ఉంద‌ని తెలిసిన వెంట‌నే ఎవ‌రైనా స‌రే.. త‌మ జీవ‌న విధానంలో అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాలి. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆహారాల‌ను టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు నిత్యం తింటుంటే ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను అదుపు చేయ‌వ‌చ్చు. ఫ‌లితంగా డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే...

1. రాగులు
టైప్ 2 డయాబెటిస్ ఉన్న‌వారు రాగుల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. రాగుల్లో ఉండే ఫైబ‌ర్ ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను నియంత్రిస్తుంది. అలాగే వాటిలో ఉండే పాలీఫినాల్స్‌, కాల్షియం, అమైనో యాసిడ్లు డ‌యాబెటిస్‌ను నియంత్రిస్తాయి.

2. ముల్లంగి
ముల్లంగిలో ఉండే ఫైబ‌ర్ డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థవంతంగా నియంత్రిస్తుంది. క‌నుక ముల్లంగిని కూడా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

3. బెండకాయ‌లు
వీటిలో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ల ఉంటాయి. ఇవి షుగ‌ర్‌ను త‌గ్గిస్తాయి. అలాగే బెండ‌కాయ‌ల్లో ఉండే విట‌మిన్ బి, ఫైబ‌ర్‌లు కూడా డ‌యాబెటిస్‌ను నియంత్రిస్తాయి. క‌నుక బెండ‌కాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో తీసుకుంటే మంచిది.

4. కాక‌ర‌కాయలు
కాక‌ర‌కాయ‌లు షుగ‌ర్‌ను త‌గ్గించ‌డంలో అమోఘంగా పనిచేస్తాయ‌ని అంద‌రికీ తెలిసిందే. కాక‌ర‌కాయ‌ల్లో ఉండే పాలీపెప్టైడ్ ఇన్సులిన్‌లా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. ఫ‌లితంగా డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

2416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles