యాల‌కుల‌ను ఇలా వాడితే.. అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చు..!


Mon,May 6, 2019 07:11 PM

భార‌తీయులు ఎప్ప‌టి నుంచో యాల‌కుల‌ను త‌మ వంట ఇంటి పోపు దినుసుల్లో ఒక‌టిగా ఉప‌యోగిస్తున్నారు. అలాగే యాల‌కుల‌ను అనేక ర‌కాల తీపి ప‌దార్థాల్లోనూ వేస్తుంటారు. దీంతో ఆయా వంట‌కాల‌కు కమ్మ‌ని వాస‌న‌, రుచి వస్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం యాల‌కుల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా యాల‌కుల వ‌ల్ల మ‌నం అధిక బ‌రువును చాలా తేలిగ్గా, త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. యాల‌కుల‌ను పొట్టు తీసి వాటిలో ఉండే విత్త‌నాల‌ను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఆ నీటిని తాగి ఆ విత్త‌నాల‌ను తినేయాలి. దీని వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది.

2. యాల‌కుల‌ను నీటిలో వేసి బాగా మ‌రిగించి.. ఆపై వ‌చ్చే నీటిని వ‌డ‌క‌ట్టి నిత్యం ఉద‌యం, సాయంత్రం వేళల్లో ఆ నీటిని తాగితే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు.

3. రోజూ మూడు పూట‌లా భోజ‌నం చేయ‌డానికి ముందు యాల‌కుల‌ను కొన్నింటిని నోట్లో వేసుకుని న‌మిలి మింగాలి. ఆ త‌రువాత 15 నిమిషాల‌కు భోజ‌నం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు.

6310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles