శిరోజాల సంర‌క్ష‌ణ‌కు ఇంటి చిట్కాలు


Sun,November 18, 2018 04:04 PM

నేటి త‌రుణంలో చాలా మంది యుక్త వ‌యస్సులోనే వెంట్రుక‌ల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. చాలా మంది జుట్టు తెల్ల‌బ‌డుతోంది. అందుకు అనేక కార‌ణాలుంటున్నాయి. అలాగే చుండ్రు, జుట్టు రాలిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాంటి వారు కింద సూచించిన ప‌లు చిట్కాలు పాటిస్తే ఆరోగ్య‌వంత‌మైన శిరోజాలు సొంత‌మ‌వుతాయి. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఎండు ఉసిరి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకొని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది. ఇతర వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

2. ఒక కప్పు ఎండు ఉసిరిని నాలుగు కప్పుల నీళ్లల్లో వేసి చిటికెడు చ‌క్కెర కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం ఒక కప్పు మోతాదుకు వచ్చిన తర్వాత ఇందులో రెండు కప్పుల హెన్నాపొడి, గుడ్డుసొన, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుక‌ల స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి.

3. సరిపడా హెన్నా, గుడ్డుసొన, అర చెక్క నిమ్మరసం, ఒక టేబుల్‌ స్పూను ఇన్‌స్టంట్‌ కాఫీపొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 45నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో వెంట్రుక‌లు న‌ల్ల‌గా, దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు పోతుంది.

5036

More News

VIRAL NEWS