ఆదివారం 07 జూన్ 2020
Health - Apr 02, 2020 , 12:00:07

కరోనా: యుద్ధనౌక నుంచి 3,000 మంది నావికుల తరలింపు

కరోనా: యుద్ధనౌక నుంచి 3,000 మంది నావికుల తరలింపు

కరోనా వ్యాపించిన అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ నుంచి 3,000 మంది నావికులను రేవులో దింపి ఆస్పత్రులకు తరలించాలని నౌకాదళ అధికారులు నిర్ణయించారు. శుక్రవారం  వారిని తీరానికి చేరుస్తారు. కరోనా వ్యాపించిన కారణంగా నౌకలో క్వారంటైన్ అమలు చేస్తున్నారు. గువామ్ లో నావికులకు కరోనా పరీక్షలు జరుపగా సుమారు వందమందికి పాజిటివ్ వచ్చింది. ఆ విమానవాహక యుద్ధనౌకలో మొత్తం 5,000 మంది వరకు ఉన్నారు. వారిని హోటళ్లలో, ఇతర భవనాల్లో ఉంచి పరీక్షలు, చికిత్సలు చేయాలని భావిస్తున్నారు. అయితే పెద్దసంఖ్యలో నావికులను దింపినప్పటికీ నౌకలో ఇంకా కొందరు ఉండిపోయి కీలక వ్యవస్థలను పనిచేయిస్తారని అమెరికా నౌకాదళ కార్యదర్శి థామస్ మాడ్లీ చెప్పారు. మొత్తం అందరిని దింపి నౌకను ఖాళీ చేయించలేమని, కీలక బాధ్యతలు నిర్వహించేవారు నౌకలో ఉండక తప్పదని ఆయన వివరించారు.


logo