నడుం నొప్పికి కారణాలు చికిత్సా విధానాలు

నడుం నొప్పి రెండు రకాలు..ఒకటి, అక్యుట్ లో బ్యాక్ పెయిన్ రెండు, క్రానిక్ లో బ్యాక్ పెయిన్.
క్రానిక్ బ్యాక్ పెయిన్ : నడుం నొప్పి మూడు నెలల కన్నా ఎక్కువ కాలం ఉంటే, దాన్ని ‘దీర్ఘకాలిక నడుం నొప్పి’ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా, మనిషి వైకల్యానికి ఇది రెండో సాధారణ కారణం. ఈ సమస్య చాలామందికి వస్తుంది, వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. వ్యక్తి జీవన విధానం మీదా, వృత్తి ఉద్యోగాల మీదా తీవ్ర ప్రభావం చూపుతుంది.
నడుం నొప్పి వివిధ కారణాలవల్ల వస్తుంది.
1. యాక్సిడెంట్స్, వెన్నుపూసకు గాయాలు, ఫ్రాక్చర్స్.
2. కండరాల స్ప్రెయిన్.
3. క్షయ వ్యాధి.
4. స్పాండిలైటిస్.
5. మానసిక ఒత్తిడి, డిప్రెషన్.
6. వెన్నుపూస ఎముకలు జారడం.
1. ప్రమాదాలతో వచ్చే నడుం నొప్పి
ప్రమాదాల్లో బలమైన దెబ్బ తగలడం వల్ల లేదా చాలా బరువైన వస్తువులను ఎత్తడం వల్ల కండరాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో.. వెన్నుపూస ఎముకలు విరగడం, వెన్ను మధ్యలోని జెల్ లాంటి డిస్కు బయటకు రావడం కూడా జరుగుతుంది.
2. ఇతర వ్యాధులతో వచ్చే నడుం నొప్పి
క్షయవ్యాధి : వెన్నుపూస ఎముకలకు క్షయ సోకడం, అవి చీము పట్టడం జరుగుతుంది. దానివల్ల వెన్నుపూస ఎముకలు అరగడం, దెబ్బతినడం జరుగుతుంది.
క్యాన్సర్: ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వెన్నుపూసకు సోకినప్పుడు, వెన్నుపూస ఎముకలు ఫ్రాక్చర్ అవుతాయి.
3. వయసుతో వచ్చే నడుం నొప్పి: దీర్ఘకాలంగా బరువైన పనులు చేసే భవన నిర్మాణ కూలీలకు, శ్రామికులకు వెన్నుపూస, డిస్క్ అరిగే ఆస్కారం ఎక్కువ. దీనివల్ల కూడా నడుం నొప్పి వస్తుంది.
4. డిస్క్ ప్రొలాప్స్ వల్ల వచ్చే నడుం నొప్పి: నడుం నుంచి, తొడ వెనుక భాగం నుంచి.. అరికాలు పాదం వరకూ నొప్పి వస్తుంది. దీన్ని ‘సయాటికా’ అంటారు. డిస్క్ ప్రొలాప్స్ అరగడం, వెన్నుపూస నరాల ఒత్తిడి వల్ల జరుగుతుంది.
5. రోడ్డు ప్రమాదాలవల్ల వచ్చే నడుం నొప్పి: ఈ సమస్యతో బాధపడుతున్నవారిని విపరీతమైన నొప్పి వేధిస్తుంది. కాళ్లు కదల్చలేకపోవడం కూడా ఉంటుంది.
6. క్షయవ్యాధివల్ల వచ్చే నడుం నొప్పి: కండరాలు బాగా పట్టేసి ఉంటాయి. విపరీతమైన నొప్పి ఉంటుంది.
నిర్ధారణ
ఎంఆర్ఐ లుంబార్ స్పైన్/ సీటీ లుంబార్ స్కాన్ చేసి వ్యాధి ఎక్కడ ఉందో, దేనివల్ల నొప్పి వస్తుందో కనుక్కోవచ్చు.
ట్రీట్మెంట్ : నడుం నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సమస్య మూలాన్ని కనిపెట్టి, దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే, నొప్పిని చాలావరకూ తగ్గించవచ్చు.
కన్జర్వేటివ్ థెరపీ : మందులతో చేసే ట్రీట్మెంట్ ఇది.
సయాటికా : డిస్క్ పొల్రాప్స్లో ఇచ్చే ట్రీట్మెంట్.
బెడ్ రెస్ట్ : మొదట అందరికీ సాధారణంగా బెడ్‌రెస్ట్ సూచిస్తాం. దీని వల్ల రోజూ చేసే పనులకు దూరంగా ఉండటం, బరువులు ఎత్తకుండా ఉండటం వల్ల నడుం నొప్పి చాలా వరకూ తగ్గుతుంది. తర్వాత ఫిజియోథెరపీ. ఇందులో హాట్ ప్యాక్స్, అల్ట్రాసౌండ్ థెరపీ ఉంటాయి. కొంచెం నొప్పి తగ్గిన తర్వాత కండరాల నొప్పి తగ్గడానికి ఎక్సర్సైజ్ థెరపీని సూచిస్తాం.
సర్జికల్ ట్రీట్మెంట్ : వ్యాధి తీవ్రతనుబట్టి సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. క్షయ, క్యాన్సర్ ట్యూమర్స్, వెన్నుపూస ఎముకలు జరగడం, ఫ్రాక్చర్.. వీటికి సర్జరీతో ట్రీట్ చేస్తాం.
సైకలాజికల్ ట్రీట్మెంట్ : మానసిక, ఒత్తిడి, డిప్రెషన్వల్ల వచ్చే నడుం నొప్పికి సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది.
Dr.Naveen Reddy
Consultant Neuro Surgery
MBBS, DNB
Renova Neelima Hospitals
Sanath Nagar, Hyderabad
Contact no: 18005998989 , 9121012265
తాజావార్తలు
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!
- బంగారం వద్దు ఇల్లే ముద్దు.. 70 % మంది మహిళల మనోగతం!
- బొలేరో, ఆటో ఢీ.. ఒకరి మృతి, ఆరుగురికి గాయలు
- కోట్లు పలికిన పదిసెకన్ల వీడియో