శనివారం 24 అక్టోబర్ 2020
Health - Oct 01, 2020 , 03:10:11

క్యాన్సర్‌ తర్వాత.. ఆయుర్వేదం

క్యాన్సర్‌ తర్వాత.. ఆయుర్వేదం

నేను క్యాన్సర్‌ పేషెంట్‌ని. సర్జరీ తరువాత కీమోథెరపీ, రేడియేషన్‌ కూడా ఇచ్చారు. దీంతో రోగ నిరోధకత తగ్గినట్టు అనిపిస్తున్నది. నేను ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, మళ్లీ క్యాన్సర్‌ రాకుండా జాగ్రత్త పడటానికి ఏం చేయాలి? 

- రజిత, హైదరాబాద్‌

క్యాన్సర్‌ ప్రభావం, దానికి తీసుకునే చికిత్సల ప్రభావం కూడా మన వ్యాధి నిరోధక వ్యవస్థపై తప్పకుండా ఉంటుంది. కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల బోన్‌ మ్యారోలో తెల్ల రక్తకణాలు తగ్గిపోయి, ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. మంచి ఆహారం, తగినంత నిద్ర, క్రమబద్ధమైన వ్యాయామం, ఒత్తిడినీ భావోద్వేగాలనూ మేనేజ్‌ చేసుకోవడం.. ఇమ్యూనిటీ మీద వీటన్నిటి ప్రభావం ఉంటుందని చాలామందికి తెలియదు. అలాగే దురలవాట్లకు దూరంగా ఉండాలి. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సమయంలో పది నిమిషాల పాటైనా ఎండ తగిలేలా చూసుకుంటే విటమిన్‌-డి తగ్గకుండా ఉంటుంది. కాల్సిట్రయోల్‌ (విటమిన్‌-డి3) క్యాన్సర్‌ కణాలపై ప్రభావం చూపుతుందనీ, కణితి పెరుగుదలను నివారిస్తుందనీ, యాంటి క్యాన్సర్‌ ఏజెంట్‌గా ఉపయోపడుతుందని ఇటీవలి అధ్యయనాలు చెప్తున్నాయి. ఆయుర్వేదంలోని రిఫ్లెక్సాలజీ, ఆక్యుపంక్చర్‌, శిరోధార, అభ్యంగ లాంటి పంచకర్మ చికిత్సలు కూడా ఇమ్యూనిటీని ప్రేరేపిస్తాయి. అయితే, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని తీసుకోవాలి. 
logo