బుధవారం 28 అక్టోబర్ 2020
Health - Sep 20, 2020 , 00:00:34

సుఖవ్యాధులపై శాస్త్రీయ పద్ధతుల్లో అవగాహన కల్పించడం ఎలా...

సుఖవ్యాధులపై శాస్త్రీయ పద్ధతుల్లో అవగాహన కల్పించడం ఎలా...

నేను సోషల్‌ వర్క్‌ చేస్తుంటాను. ఆర్థిక సమస్యలతో పదో తరగతి వరకే చదివాను. మా ఊర్లో ఒకవ్యక్తి ఈ మధ్య జంతువులతో లైంగిక చర్యలో పాల్గొన్నాడు. ఊరి వారందరూ పట్టుకుని తన్నారు. సుఖవ్యాధులు తగ్గాలని అలా చేశానని చెప్పాడతను. వీళ్లకు ఏ రకమైన శాస్త్రీయ పద్ధతుల్లో అవగాహన కల్పించాలో చెప్పండి. - నందిని, వికారాబాద్‌

నీ ఆలోచన చాలా మంచిది. నువ్వు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో సైకాలజీ చేస్తే సమాజానికి ఉపయోగపడుతావు. ఈ అపోహలో స్వార్థ ప్రయోజనాలున్నాయి. వికృత మనస్తత్వం ఉన్న కొద్దిమంది పురుషులు లైంగిక కలయికకు సంబంధించిన బోర్‌ తగ్గించుకోవడానికి ఇలాంటి ప్రకృతి విరుద్ధ ప్రయోగాలు చేస్తుంటారని శాస్త్రవేత్తల అంచనా. అరవలేని, ప్రతిఘటించలేని పసిపిల్లలు, జంతువులను ఇందుకోసం ఎంచుకోవడం విషాదకరం. ఇది క్రమంగా ఫీడో ఫీలియా, భీష్టాలిటీ అనే మనోలైంగిక వ్యాధులకు దారితీస్తుంది. సుఖవ్యాధులు సోకని ఆడపిల్లలు, పసిపిల్లలు, నోరు లేని జీవాలు వీరి వికృత తత్వానికి బలి పశువులు. ఇలా చేయడం వల్ల సుఖవ్యాధులు తగ్గుతాయని అనుకోవడం ఒక మూఢ నమ్మకం. సెక్స్‌, వీడీఆర్‌ఎల్‌ స్పెషలిస్ట్‌ దగ్గర రక్త పరీక్షలు చేయించుకుని, వ్యాధి నిర్ధారణ అయ్యాక, శాస్త్రీయమైన వైద్య చికిత్సతోనే సుఖవ్యాధులు తగ్గుతాయి. అంతేగానీ అత్యాచారాలు చేయడం ద్వారా ఇతరులకూ అంటించి, వారి జీవితాలను నాశనం చేయడం ద్వారా కాదు. వీళ్లకు కౌన్సెలింగ్‌, సైకోథెరపీ అత్యవసరం. 


డాక్టర్‌ భారతి

సెక్సాలజిస్ట్‌, మారిటల్‌, సైకోథెరపిస్టు

డైరెక్టర్‌, జివిఎస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ సెక్సువల్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌

హైదరాబాద్‌, 9849770409

[email protected]


logo