శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Sep 08, 2020 , 00:09:29

కషాయాలు మంచివేనా?

కషాయాలు మంచివేనా?

కొవిడ్‌ను ఎదుర్కోవడానికీ, ఇమ్యూనిటీ పెంచుకోవడానికీ ఇప్పుడందరూ కషాయాల బాట పడుతున్నారు. పసుపు, అల్లం, తేనె, మెంతుల వంటి వాటి వినియోగం పెంచారు. అయితే వీటిని శ్రుతి మించి వాడితే అనర్థాలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. మెంతులను నానబెట్టి వాటి డికాషన్‌ తాగడం వల్ల రక్తం పలుచబడవచ్చని హెచ్చరిస్తున్నారు కేరళకు చెందిన డాక్టర్‌ ఫిలిప్స్‌. ఇక కాలేయ వ్యాధులున్నవాళ్లు ఇది తీసుకుంటే మరింత ప్రమాదమంటున్నారు. మెంతుల కషాయాన్ని మితంగా తీసుకుంటే ఇమ్యూనిటీని పెంచే అవకాశం ఉంది. కానీ రోజుకి రెండు గ్లాసులంటూ తాగేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్‌ ఫిలిప్స్‌. అలొవెరా జ్యూస్‌ను కూడా అతిగా తీసుకుంటే కాలేయం దెబ్బతింటుందంటున్నారాయన. అదేవిధంగా పసుపును పరిమితికి మించి వాడితే డయాబెటిస్‌ కంట్రోల్‌ తప్పవచ్చనీ, మధుమేహుల్లో లివర్‌ దెబ్బతినవచ్చనీ అంటున్నారు ఢిల్లీకి చెందిన డాక్టర్‌ ఎం.షఫీ. అందుకే ఏదైనా సరే మంచి చేస్తుంది కదా అని మితి మీరి తీసుకోవద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇలాంటి కషాయాలు వాడాలంటే ఒకసారి ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. logo