శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Aug 31, 2020 , 23:29:20

కరోనా వేళ.. కండ్లద్దాలు జాగ్రత్త!

కరోనా వేళ.. కండ్లద్దాలు జాగ్రత్త!

ప్రస్తుత కరోనా వైరస్‌ సంక్షోభంలో ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌, కండ్లద్దాలు ధరించడం తప్పనిసరి. గాలిలో ఉండే వైరస్‌ రేణువులు కళ్లలోకి ప్రవేశించకుండా నివారించడానికి ఈ కండ్లద్దాలు తోడ్పడుతాయి. దృష్టి సమస్యలకు పెట్టుకునే కండ్లద్దాలైనా రక్షిస్తాయి. మాస్క్‌లైతే వాడి పారేస్తాం. లేకుంటే శుభ్రపరుచుకుంటాం. కానీ కండ్లద్దాల విషయంలో పెద్దగా పట్టించుకోం. కండ్లద్దాలపై కరోనా వంటి వైరస్‌లు 9 రోజుల పాటు ఉండవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందుకే చేతుల మాదిరిగానే కండ్లద్దాలను కూడా శుభ్రపరుచుకోవాలి. అదెలాగంటే..

  • తరచుగా కండ్లద్దాలను తాకవద్దు. 
  • కండ్లద్దాలను తీసే సమయంలో రెండు చేతులనూ ఉపయోగించండి. లెన్సుల అంచులను తాకకుండా కణతల వద్ద పెట్టుకోండి. 
  • పెట్టుకునే ముందు ప్రతిసారీ శుభ్రపరచండి. ఇందుకోసం గిన్నెలు కడిగే సబ్బు, నీటిని కూడా ఉపయోగించవచ్చు. 
  • కడిగిన వెంటనే మరకలు, గీతలు పడకుండా ఉండటం కోసం వెంటనే మైక్రోఫైబర్‌ బట్టతో తుడవండి. 
  • బయటికి వెళ్లేటప్పుడు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ద్రావణంతో శుభ్రపరచండి. 
  • లెన్సులు, ఫ్రేములను శుభ్రపరచడానికి కండ్లద్దాల షాపుల్లో దొరికే బ్రాండెడ్‌ లెన్స్‌ స్ప్రేలు కూడా ఉపయోగించవచ్చు. 
  • చేతులను శుభ్రపరిచే శానిటైజర్లతో కళ్లద్దాలు శుభ్రపరచవద్దు. దీనివల్ల లెన్సులు దెబ్బతింటాయి. 
  • అమ్మోనియా, బ్లీచ్‌, నిమ్మరసం, వెనిగర్‌ లాంటి ఆమ్ల పదార్థాలు కూడా వాడవద్దు. 

డాక్టర్‌ అక్షయ్‌ బడకెరే

నేత్ర వైద్య ,నిపుణులు

ఎల్‌వి ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ,హైదరాబాద్‌


logo