శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Jul 27, 2020 , 23:21:26

ధ్యానంతో ఇమ్యూనిటీ!

ధ్యానంతో ఇమ్యూనిటీ!

శరీరాన్నీ, మనసునీ ఏకం చేసే శక్తి యోగా, ధ్యానాలకు ఉంది. భావోద్వేగాలను అదుపులో ఉంచే ధ్యానం ఆస్తమా నుంచి గుండెజబ్బుల దాకా చాలా రకాల అనారోగ్యాలను దూరం చేయగలదని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆధునిక జీవనంలో నిరంతరం ఒత్తిడే. మనసు నిత్యం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధ్యానం మంచి ఔషధంలా పనిచేస్తుందనేది చాలామందికి అనుభవమే. మానసిక అపసవ్యతలను కూడా ఇది క్రమబద్ధం చేస్తుంది. కోపాన్ని నియంత్రిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజూ ధ్యానం చేసేవాళ్లకు ఇన్‌ఫెక్షన్లను దూరంగా పెట్టే ఇమ్యూనిటీ (వ్యాధినిరోధక శక్తి) పెరుగుతుంది. ధ్యానంలో ఆక్సిజన్‌ అవసరం బాగా తగ్గుతుంది. శ్వాసకోశాలు నిదానంగా పనిచేస్తాయి. గుండెవేగం, రక్తపోటు తగ్గుతాయి. ఇది శరీరం సేద తీరుతుందనడానికి సంకేతం. ఈ స్థితిలో ఉద్వేగాలు తగ్గిపోతాయి. మెదడులో ప్రశాంత తరంగాలు మొదలవుతాయి. ఇవి మెదడు విశ్రాంతి స్థితిని తెలియజేస్తాయి. ఆస్తమా పేషెంట్లకు ధ్యానం వల్ల శ్వాసకోశాలు ఆరోగ్యంగా పనిచేస్తాయని పరిశోధనల్లో రుజువైంది. అదనంగా, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. 


logo