మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Jul 25, 2020 , 23:34:26

ఆయనకి గుండెనొప్పి.. కలయికలో జాగ్రత్తలేమిటి?

ఆయనకి గుండెనొప్పి.. కలయికలో జాగ్రత్తలేమిటి?

మా వారి వయసు నలభై ఎనిమిది. నాలుగు నెలల క్రితం ఆయనకి ఏంజైనా పెక్టోరిస్‌ అనే గుండెనొప్పి వచ్చింది. లైంగిక జీవితం గుండెమీద ప్రభావం చూపిస్తుందా? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

- ప్రశాంతి, నల్గొండ

మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌, ఏంజైనా పెక్టోరిస్‌ అనే గుండెపోటుకి గురైనవారు బైపాస్‌ సర్జరీ అయిన వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. నాలుగు నుంచి ఆరు నెలల తర్వాతనే పాల్గొనాలి. ఒకసారి రోగి మానసిక, శారీరక స్థితి నార్మల్‌కి వచ్చాక.. ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ నార్మల్‌కి వచ్చి, ఆయాసం, అసౌకర్యం లేకపోతే శృంగారంలో పాల్గొనవచ్చు. ఏ కారణాల వల్ల అయినా రోగి తీవ్రమైన ఆందోళనకు, ఒత్తిడికి గురైతే గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. కాబట్టి లైంగిక కలయికకు దూరంగా ఉండాలి. కార్డియాలజిస్ట్‌ సూచించిన మందులను అసలు మానకూడదు. రోజూ వేసుకోవాలి. భోజనం చేసిన రెండు గంటల లోపల గుండెజబ్బులున్నవాళ్లే కాదు, లేనివాళ్లు కూడా శృంగారంలో పాల్గొనకూడదు. అన్‌స్టేబుల్‌ ఏంజైనా, క్రానిక్‌ ఏంజైనా లాంటి గుండెజబ్బులున్నవాళ్లు కార్డియాలజిస్ట్‌ సూచనతో శృంగారానికి గంట ముందు డాక్టర్‌ సూచించిన బీటా బ్లాకర్‌ (పేరు వేరే ఉంటుంది) మందు వేసుకోవాలి. గుండెపైన, పొట్టపైన తక్కువ శ్రమ కలిగించే పద్ధతులను ఎంచుకోవాలి. 


డాక్టర్‌ భారతి, సెక్సాలజిస్ట్‌, మారిటల్‌, సైకోథెరపిస్టు

డైరెక్టర్‌, జివిఎస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ సెక్సువల్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌, హైదరాబాద్‌

9849770409

[email protected]


logo