ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Jul 18, 2020 , 00:46:44

పాపాయికి..‘గంజి’ టానిక్‌!

పాపాయికి..‘గంజి’ టానిక్‌!

బియ్యం ఉడుకుతున్నప్పుడు వచ్చే గంజి.. బుజ్జి పాపాయిలకు ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. 

జ్వరం

రెండుమూడు కప్పుల గంజిని కొద్ది కొద్దిగా పాపాయికి తాగిస్తూ ఉంటే క్రమంగా జ్వరం తగ్గిపోతుంది. 

శక్తినిచ్చే పోషకం

గంజినీటిలో కార్బోహైడ్రేట్‌లు  ఉంటాయి. ఇవి బిడ్డకు శక్తిని అందిస్తాయి. ఎక్కువసేపు ఆడుకుంటూ ఉత్సాహంగా ఉండటానికి సహాయపడతాయి. ఇది తొందరగా అరుగుతుంది కూడా. అందుకే రోజూ పాపాయికి కొద్దిగా గంజి తాగిస్తే మంచిది.

అతిసారానికి..

పిల్లల్లో తరచుగా కనిపించే విరేచనాలను నివారించడంలో గంజి మంచి మందు. ఇతరత్రా జీర్ణకోశ సమస్యలకు కూడా ఇది పనిచేస్తుంది. బ్రిటిష్‌ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. విరేచనాలు ఉన్నా, గ్యాస్ట్రోఎంటరైటిస్‌ ఉన్నా కప్పు బియ్యంలో మూడు కప్పుడు నీటిని కలిపి, పదిహేను నిమిషాలు ఉడికించి..ఆ వచ్చిన గంజిని నాలుగు గంటలకోసారి ఇస్తే ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అయితే అతిసారానికి వాడే ఓఆర్‌ఎస్‌కి ఇది ప్రత్యామ్నాయం కాదు. 

ఎక్జీమా

పిల్లల్లో ఎక్కువగా కనిపించే చర్మ సమస్య ఎక్జీమా. ఇలాంటప్పుడు రెండు కప్పుల గంజిని గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయించాలి. బియ్యంలో ఉండే నూనెలు చర్మానికి తేమను కలిగిస్తాయి. ఎక్జీమా మచ్చల వల్ల కలిగే పొడితనాన్ని తగ్గిస్తాయి. అయితే కొంతమంది పిల్లలకు బార్లీ, ఓట్స్‌ లాంటి వాటితో అలర్జీ ఉండవచ్చు. కొందరికి బియ్యంతో కూడా అలర్జీ రావచ్చు. అలర్జీ ఉన్నప్పుడు కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లు, వాంతులు, శ్వాసలో ఇబ్బంది లాంటి సమస్యలు కనిపించవచ్చు. అందుకే మీ బిడ్డకు గంజినీటిని తాగించాలని అనుకునే ముందు ఒకసారి పిల్లల డాక్టర్‌ సూచనలు తీసుకోవడం మంచిది.


తాజావార్తలు


logo