శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jul 13, 2020 , 23:27:11

హాస్పిటల్‌లో..యాంటి బయాటిక్స్‌!

హాస్పిటల్‌లో..యాంటి బయాటిక్స్‌!

బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వస్తే యాంటిబయాటిక్‌ వేసుకుంటాం. కానీ, ఇటీవలి కాలంలో హాస్పిటల్‌లో ఉండటం వల్లనే ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయి. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు, చికిత్స కోసం వెళ్తే.. కొత్త వ్యాధులు వెంటబడుతూ ఉంటాయి. హాస్పిటల్‌ వాతావరణంలో ఇన్‌ఫెక్షన్ల వల్లనే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. సర్జరీలు చేయించుకున్నవాళ్లలో ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. శస్త్రచికిత్సలో ఉపయోగించే పరికరాల మీద ఉండే బాక్టీరియా ఇందుకు కారణం. అందుకే వైద్య పరికరాలకు కూడా యాంటీ బయాటిక్స్‌ వాడాలంటున్నారు పరిశోధకులు. 

హాస్పిటల్‌ ఇన్‌ఫెక్షన్లను నిరోధించడానికి ఈ పరికరాలకు యాంటీ బయాటిక్‌ పూత వేసే కొత్త విధానాన్ని కనుగొన్నారు మిసిసిపీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇలా ఆధునీకరించిన వైద్య పరికరాలపైన శక్తిమంతమైన పెన్సిలిన్‌ యాంటీ బయాటిక్‌ పూత వేసినప్పుడు అది తొలగిపోకుండా ఉంటుంది. కాబట్టి వీటిని ఉపయోగించినా రోగులకు ఇన్‌ఫెక్షన్లు రావు. అయితే ఈ విధానం  పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. 


logo