బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Jul 06, 2020 , 23:28:37

ఎదిగే పిల్లలకు రాగిజావ

ఎదిగే పిల్లలకు రాగిజావ

మన శరీరానికి ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే చిరు ధాన్యాల్లో రాగులు ముఖ్యమైనవి. రాగులను ఏ రకంగా తీసుకున్నా ప్రయోజనమే. అందులోనూ రాగిజావను సులభంగా చేసుకోవచ్చు. రాగుల్లో ఉండే ప్రొటీన్లు రోజూ వ్యాయామం చేసేవారికి చక్కగా ఉపయోగపడుతాయి. వారిలో కండరాల నిర్మాణానికి తోడ్పడుతాయి. అందుకే ఎదిగే పిల్లలకు రాగి జావ ఇవ్వాలంటారు. రాగిలోని పోషకాలతో.. అవయవాల్లో లోపాలు లేకుండా, పెరుగుదలలో ఆటంకం కలుగకుండా పిల్లలు ఎదుగుతారు. చిన్నతనంలోనే స్థూలకాయం రాకుండా నివారించవచ్చు. రాగుల్లో క్యాల్షియం పుష్కలం. అందువల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. వీటిలోని పాలీఫినాల్స్‌ మధుమేహ నియంత్రణలో ఉపయోగ పడుతుంది. రాగుల్లో ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను అధిగమించవచ్చు. కౌమారంలోకి అడుగిడే ఆడపిల్లలకు తప్పనిసరిగా రాగిజావ ఇవ్వాలి. 


logo