బుధవారం 05 ఆగస్టు 2020
Health - Jul 06, 2020 , 23:28:34

నోటిలో పుండు.. మానేందుకు చిట్కాలు

నోటిలో పుండు.. మానేందుకు చిట్కాలు

ఏమీ తిననివ్వకుండా, తాగనివ్వకుండా ఇబ్బంది పెట్టే సమస్య మౌత్‌ అల్సర్‌. విటమిన్ల లోపం, మానసిక ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం, డీహైడ్రేషన్‌.. లాంటి కారణాల వల్ల ఇవి వస్తాయి. వీటినుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు.. 

  • మౌత్‌ అల్సర్‌ ఉన్నప్పుడు విటమిన్‌-సి అధికంగా ఉండే ఆరెంజ్‌, జామ, స్ట్రాబెర్రీ, బొప్పాయి లాంటి పండ్లను తినాలి. విటమిన్‌ సప్లిమెంట్లను టాబ్లెట్స్‌ లేదా పిల్స్‌ రూపంలో తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. 
  • రోజూ పెరుగు తింటే లేదా రెండు మూడు గ్లాసుల మజ్జిగ తాగితే చెడు బ్యాక్టీరియా పోతాయి. 
  • పచ్చి టమాటాలను తింటే కూడా నోటి అల్సర్లు తగ్గుముఖం పడుతాయి. వీటిని అల్సర్‌ ఉన్నవైపు కాకుండా మరోవైపు బాగా నమిలి రసం నోట్లో ఉండేలా చూసుకోవాలి.
  • టూత్‌ బ్రష్‌ను తరచూ మార్చాలి. పాతదానిలోని బ్యాక్టీరియా అల్సర్‌కు కారణం కావచ్చు. 
  • కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌, ఆల్కహాల్‌ వంటి వాటి జోలికి వెళ్లకూడదు. 
  • ఎండు కొబ్బరి నమిలి కొద్దిసేపు నోట్లో అలాగే పెట్టుకోవాలి. కొబ్బరి నూనెను 5 నుంచి 10 నిమిషాలు పుక్కిలించినా ఫలితం ఉంటుంది. 


logo