సోమవారం 03 ఆగస్టు 2020
Health - Jul 04, 2020 , 00:49:17

బాలింతలు మెంతులు తీసుకుంటే పాలు పడతాయా?

బాలింతలు మెంతులు తీసుకుంటే పాలు పడతాయా?

బాలింతలకు ప్రత్యేకమైన భోజనాన్ని వండుతారు. ఆహారంలో భాగంగా వారికి మెంతులను కూడా ఇవ్వాలని అంటుంటారు. మన పెద్దవాళ్లు చెప్పింది నిజమే. బాలింతలకు మెంతులు ఇవ్వడం వల్ల తల్లిపాలు వృద్ధి చెందుతాయని నిర్ధారించారు పోషకాహార నిపుణులు. మెంతులలో ఉండే ఫైటో ఈస్ట్రోజన్లు పాల ఉత్పత్తిని పెంచుతాయని ఇటీవలి అధ్యయనంలో కూడా తేలింది. పాలిచ్చే తల్లులు రోజుకు ఆరు గ్రాముల వరకు మెంతులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. అయితే కొందరిలో విరేచనాలు, హైపోైగ్లెసీమియా లాంటి సమస్యలు రావచ్చు. ఇలాంటప్పుడు వాటిని తీసుకోకూడదు. మెంతులతోపాటుగా రోజూ లీటరు వరకూ పాలు ఏదో ఒక రూపంలో వినియోగించాలి. బ్రెడ్‌ తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.logo