ఆదివారం 05 జూలై 2020
Health - Jun 30, 2020 , 23:05:04

ఇంట్లో ఉండే వస్తువుల పై క్రిములను తొలగించడానికి చిట్కాలు

ఇంట్లో ఉండే వస్తువుల పై క్రిములను తొలగించడానికి చిట్కాలు

హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరికీ వారు రక్షణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం మన ఇంట్లో సూక్ష్మక్రిములు బాగావ్యాప్తి చెందే పలు ప్రదేశాలున్నాయి. వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వీటిలో టాయిలెట్ సీటు,  కూరగాయలు కోసే చాపర్ , డైరీ ఉత్పత్తులు నిల్వ చేసే రిఫ్రిజిరేటర్ డ్రాయర్.... వంటి వాటితోపాటు ఇతర వస్తువులపై బ్యాక్టీరియా జీవిస్తుంది. అంతేకాకుండా మరికొన్ని వస్తువులపై క్రిములు ఉంటాయి. అటువంటి వాటిని తొలగించడానికి సింపుల్ గా ఈ  టిప్స్ పాటిస్తే సరిపోతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరు ఇంటిలో పాత్రలను తోమటానికి డిటర్జెంట్ పొడి లేదా లిక్విడ్ ని ఉపయోగిస్తారు. డిటర్జెంట్ పొడి బంగారు ఆభరణాలను శుభ్రం చేయటానికి ఒక ముఖ్యమైనది . దీనిని ఒక బౌల్ లో గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో డిటర్జెంట్ పొడి లేదా లిక్విడ్ వేసి కలపాలి.

ఈ మిశ్రమంలో బంగారు ఆభరణాలను వేసి కొంచెం సేపు ఉంచితే మురికి తొలగిపోతుంది. ఆభరణాల అంచులను టూత్ బ్రష్ సాయంతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత మంచి నీటిలో ఆభరణాలను కడిగి మెత్తని పొడి వస్త్రంతో తుడవాలి. ఇది బంగారు ఆభరణాలను శుభ్రం చేయటానికి చవకైన , సమర్ధవంతమైన విధానం అని చెప్పవచ్చు. వెండి ఆభరణాలను శుభ్రం చేయటానికి ఉప్పు స్నానం సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి, దానిలో వెండి ఆభరణాలను వేసి కొంచెం సేపు ఆలా ఉంచాలి. ఆ తర్వాత టూట్ బ్రష్ సాయంతో రుద్ది మంచి నీటితో కడగాలి. వెండి ఆభరణాలు శుభ్రం చేయడానికి చవకైన, వేగవంతమైన , సున్నితమైన మార్గాలలో ఇది ఒకటి. బంగారు ఆభరణాలను శుభ్రం చేయటానికి టూత్ పేస్టు సమర్ధవంతమైనదిగా చెప్పవచ్చు.

టూత్ పేస్టు ని కొంచెం తీసుకోని ఆభరణాలకు రాసి టూట్ బ్రష్ సాయంతో అంచులు ,మూలల్లో రుద్దాలి. తేలికపాటి టూత్ పేస్టు ను ఉపయోగిస్తే ఆభరణం కాంతి కోల్పోకుండా సులభంగా మలినాలను తొలగించవచ్చు. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో 10 నిముషాలు ఉంచి పొడి వస్త్రంతో తుడవాలి. అమ్మోనియా గోరువెచ్చని నీటిలో కొంచెం అమ్మోనియా పొడిని వేసి బాగా కలపాలి. ఈ ద్రావణంలో బంగారు ఆభరణాలను వేసి ఒక నిమిషం అయ్యాక టూట్ బ్రష్ సాయంతో రుద్దాలి. బంగారు ఆభరణాలను సులభంగా శుభ్రం చేయటానికి అమోనియా సహాయపడుతుంది. అయితే బంగారు ఆభరణాలలో ముత్యాలు లేకుండా చూసుకోవాలి.   


logo