సోమవారం 06 జూలై 2020
Health - Jun 30, 2020 , 01:52:18

గర్భిణులకు నారింజ జ్యూస్‌

గర్భిణులకు నారింజ జ్యూస్‌

గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డ పుట్టేవరకూ చక్కని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని   వైద్యులు చెబుతుంటారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలూ సమతులంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గర్భిణుల నిత్య ఆహారంలో నారింజపండు రసాన్ని కూడా చేర్చాలంటున్నారు నిపుణులు. నారింజపండ్లలోని విటమిన్‌-సి బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతేకాదు విటమిన్‌-సి వల్ల శరీరం ఇనుమును బాగా గ్రహించగలుగుతుంది. ఫలితంగా ప్రసవంలో సాధారణంగా కనిపించే రక్తహీనత సమస్యను ఎదుర్కొనవచ్చు. ఆరెంజ్‌లలో ఫోలేట్‌ కూడా పుష్కలం. ఇది శిశువు ఎదుగుదలకు ఎంతో అవసరం. గర్భంతో ఉన్నవాళ్లలో అధిక రక్తపోటు సమస్య వస్తుంటుంది. అలాంటివాళ్లకు ఆరెంజ్‌ జ్యూస్‌ మంచి మందు. దీనివల్ల బీపీ తగ్గుతుంది. నిస్సత్తువగా అనిపించే గర్భిణులు దీన్ని తాగితే శక్తి పుంజుకొంటుంది. ఉత్సాహంగానూ ఉంటారని చెప్తున్నారు పోషకాహార నిపుణులు.


logo