మంగళవారం 14 జూలై 2020
Health - Jun 29, 2020 , 22:51:58

వేడినీటి కాపడం..

వేడినీటి కాపడం..

మిరియాల పాలతో జలుబు, ఓమతో దగ్గు తగ్గించే నానమ్మలూ, అమ్మమ్మల చిట్కాలు చాలాసార్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇటీవల జరిగిన ఓ పరిశోధన ఇలాంటి చిట్కాను శాస్త్రీయంగా నిరూపించింది. అదే.. వేడినీటి కాపడం. వేడినీటితో కాపడం పెట్టుకోవడం వల్ల చాలావరకు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల కనీసం ఓ గంటపాటైనా నొప్పి తెలియకుండా ఉంటుందని అంటున్నారు లండన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. 104 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వేడినీళ్లు నొప్పిని అణచిపెట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు. చర్మంలోని  గ్రాహక కణాలు నొప్పికి సంబంధించిన సమాచారాన్ని జ్ఞాననాడుల ద్వారా మెదడుకు చేరవేయడానికి కొన్ని రసాయన పదార్థాలు అవసరం అవుతాయి. వేడివల్ల ఈ రసాయన పదార్థాలు నొప్పిని గుర్తించలేవు. ఫలితంగా నొప్పికి సంబంధించిన సమాచారం మెదడుకు చేరదు. తద్వారా మనకు నొప్పి తెలియకుండా పోతుంది. ఈ విషయం ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమైనా కొన్ని వందల సంవత్సరాల నుంచీ మనం వేడినీటి కాపడం పెట్టుకుంటూనే ఉన్నాం. పాత బంగారం అంటే ఇదేనేమో!

తాజావార్తలు


logo