శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jun 23, 2020 , 10:05:25

బిస్కెట్లతో మతిమరుపు

బిస్కెట్లతో మతిమరుపు

బిస్కెట్లు తింటే బుర్ర పనిచేయదా..? అవుననే అంటున్నాయి కొత్త అధ్యయనాలు. బిస్కెట్లు కరకరలాడేందుకు, కేకులకు మంచి వాసనా రుచీ రావడానికి కొన్ని రకాల ట్రాన్స్‌ఫ్యాట్స్‌ వాడుతారు. ఇవి హానిచేసే కొవ్వు పదార్థాలు. వీటితోపాటు హైడ్రోజినేషన్‌ ప్రక్రియకు లోను చేసిన నూనెలను కూడా వాడుతారు. అందుకే, వాటివల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందంటున్నారు సైంటిస్టులు. ట్రాన్స్‌ఫ్యాట్స్‌ అధికంగా ఉండే బిస్కెట్లు, కేకులు ఎక్కువగా తినేవారిలో మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు. జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రత కూడా తగ్గుతుందంటున్నారు. వీటిలో ఉండే ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ప్రభావం గురించి కాలిఫోర్నియా యూనివర్సిటీ, శాండియాగో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 45 ఏండ్లలోపు వెయ్యి మందిని అధ్యయనం చేశారు. ట్రాన్స్‌ఫ్యాట్స్‌తో కూడిన బిస్కెట్లు, కేకులు అధికంగా తిన్నవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడాన్ని గమనించారు. మరికొంతమందిలో అధిక బరువు, గుండె సంబంధ వ్యాధులు కూడా బయటపడ్డాయి. 


logo