ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Jun 20, 2020 , 16:26:26

సహజంగా బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఇలా చేయండి...

 సహజంగా బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఇలా చేయండి...

హైదరాబాద్: అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గడానికి  అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. వారు చేసే ప్రయత్నంలో వంటకు పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వరు. ఒక్క ఆహారం లో తప్ప మిగిలిన వాటిలో మార్పులు పాటిస్తే  పెద్దగా ఒరిగేదేమీ ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు, ఆకు కూరల్లో చాలా తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఆహారంగా కూరగాయలు తినవచ్చు. కూరల ద్వారా వచ్చే శక్తి కొవ్వుగా మారదు. ప్రేగుల నుంచి మెల్లమెల్లగా పీచుపదార్థాలున్నందువల్ల రక్తంలో చేరుతుంది. నూనె లేకుండా సహజమైన కొవ్వు పదార్థాలతో వంట చేసుకోవాలి. బరువుతో పాటు అనేక ఇతర సమస్యలు ఉంటాయి. బరువు తగ్గినప్పటికీ, ఆ జబ్బులన్నీ అలానే మనల్ని వేధిస్తుంటే సుఖంగా ఎలా బ్రతకగలం? మనం తినే వంట ఆ జబ్బులను ప్రోత్సహించకుండా, శరీరానికి సహకరించేదిగా ఉండాలి. అన్ని అవయవాల క్షేమం కోరేలా మన వంటలు ఉండాలి. కాబట్టి, అన్ని అవయవాలను ఇబ్బంది పెట్టే రుచులను ప్రక్కకు బెట్టి హానిలేని రుచులతో వంటలు చేయడం ఉత్తమమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

 

తాజావార్తలు


logo