మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Jun 16, 2020 , 00:18:30

ఒంటరితనం.. మృత్యుముఖం!

 ఒంటరితనం.. మృత్యుముఖం!

‘మీ స్నేహితుల్లో ఎవరైనా నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నారా..? అయితే వాళ్ల విషయంలో జాగ్రత్త పడండి’ అంటున్నారు అమెరికా పరిశోధకులు. ఇలా ఒంటరితనంతో బాధపడేవాళ్లు త్వరగా మృత్యువు బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. రెండు దఫాలుగా నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయాన్ని వారు గుర్తించారు. మొదటిసారి సుమారు మూడు లక్షల మంది మీద దఫాల వారీగా అధ్యయనం నిర్వహించారు. వీరిలో చాలామంది ఒంటరితనంతో బాధపడుతున్నవారే. కొన్ని నెలల అనంతరం ఒంటరితనంతో బాధపడుతున్నవారిలో 20శాతం మంది అకాల మృత్యువుకు గురయ్యారు. రెండవసారి 3.4 లక్షల మంది మీద అధ్యయనం నిర్వహించారు. ఈ కూడా మొదటిసారి లాగానే చాలామంది మృత్యువుకు చేరువయ్యారు.

ఒంటరి జీవుల్లో అధిక బరువు, ఒత్తిడి, రక్తపోటు, చక్కెర వ్యాధి లాంటి ఆరోగ్య సమస్యలనూ గుర్తించారు అధ్యయన కారులు. ఒంటరితనంతో బాధపడేవాళ్లలో చిన్నవయసులోనే ఈ సమస్యలు కనిపించడం వల్లనే వాటి కాంప్లికేషన్లు  మరణానికి చేరువ చేస్తున్నాయంటున్నారు. అందుకే ఒంటరితనాన్ని వీడండి. నలుగురిలో కలవండి. ఏ సమస్య ఉన్నా ఆత్మీయులతో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒంటరిగా కనిపిస్తే.. వాళ్ల సమస్య ఏమిటో తెలుసుకుని సహాయం చేసేందుకు ప్రయత్నం చేయండి. నేనున్నాననే ధైర్యాన్ని వాళ్లకు అందించండి. అంతకు మించిన మహోపకారం ఉండదు.logo