ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - Jun 15, 2020 , 02:10:44

షుగర్ వ్యాధి ఎలా వస్తుందంటే ...?

షుగర్ వ్యాధి ఎలా వస్తుందంటే ...?

హైదరాబాద్ : మన శరీరంలో వుండే ఎండోక్రైన్ అనే గ్రంథుల నుండి అనేక రకాలైన హార్మోనులు ఉత్పత్తి అయ్యి సరాసరి రక్తంలోకి విడుదలవుతూ వుంటాయి. ఈ హార్మోనులు రసాయనిక సమ్మేళనాలు అందుకే ఈ హార్మోనులను తయారుచేసే ఎండోక్రైన్ గ్రంథులు రసాయన కర్మాగారాలుగా భావిస్తారు. ఈ హార్మోనులు మన శరీరంలోని విధులన్నీ సక్రమంగా కంట్రోల్ చేస్తూ వుంటాయి. హార్మోనులలో చాలా వరకూ కణాలలో జీవకణాలను ప్రభావితం చేస్తూ వుంటాయి. వీటిలో ముఖ్యమైనది ఇన్సులిన్ హార్మోను. ఇది గ్లూకోజును జీవకణాలలోనికి ప్రవేశించేలా చేసి కణాలలో శక్తి విడుదలయ్యేలా చేస్తుంది.

పిట్యూటరీ గ్రంథి నుండి స్రవించే గ్రోత్ హార్మోను ఇన్సులిన్ కు వ్యతిరేకంగా పనిచేసి గ్లూకోజును జీవకణాలలోనికి పోనికుండా చేస్తుంది. అందుచేత రక్తంలో సుగరు పరిమాణం పెరుగుతుంది. థైరాక్సిన్, ట్రైఐడోథైరోనిల్ హార్మోనులు కూడా రక్తంలోని షుగరు పరిమాణాన్ని పెంచుతాయి. పాంక్రియాస్ గ్రంథిలోని ఆల్ఫా కణాల నుండి స్రవించే 'గ్లూకగాన్' అనే హార్మోను రక్తంలో చక్కెర పరిమాణాన్ని పెంచుతుంది. ఎడ్రినలిన్ గ్రంథిలో స్రవించే 'గ్లూకో కార్డికాయిడ్స్' అనే హార్మోనులు, ఎడ్రినలిన్ నార్ ఎడ్రినలిన్ అనే హార్మోనులు కూడా రక్తంలో షుగరు పరిమాణం పెరిగేలా చేస్తాయి. దీని కారణంగానే షుగరు వ్యాధి వస్తుంది.


logo