గురువారం 01 అక్టోబర్ 2020
Health - Jun 09, 2020 , 00:37:09

అసిడిటీని పోగొట్టే అరటి

అసిడిటీని పోగొట్టే అరటి

అజీర్ణం.. సమస్య చిన్నదే, కానీ చికాకు ఎక్కువ. గ్యాస్‌ ఏర్పడి కడుపుబ్బరంగా ఉంటుంది. అది కాస్తా అసిడిటీగా మారుతుంది. అశ్రద్ధ చేస్తే ఇంకా పెద్దది కావొచ్చు. అజీర్తి, అసిడిటీ సమస్యల నుంచి కాపాడే మంచి ఆహారం అరటిపండు. రోజుకో అరటి పండు తీసుకుంటే జీర్ణ సమస్యలతో పాటు మలబద్ధ్దకం, గుండె సమస్యలు, క్యాన్సర్‌ లాంటివి కూడా నివారించవచ్చని అంటున్నారు నిపుణులు. కొన్ని పండ్లు కొన్ని సీజన్లలోనే దొరుకుతాయి. మామిడి లాంటి పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. అతికొద్ది పండ్లు మాత్రమే రోజూ అందుబాటులో ఉంటాయి. అలాంటివాటిలో ఒకటి అరటి. దీనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్‌, పొటాషియం ఎక్కువ. ఇది రోజంతా శక్తిని ఇస్తుంది. గుండె సమస్యలకు కూడా ఇది మంచి మందు. అరటిలో సోడియం తక్కువ. దీంతో బీపీని నియంత్రిస్తుంది. దీనిలోని ఇనుము రక్తహీనత రాకుండా చేస్తుంది. అరటిలోని విటమిన్లు కంటిచూపును రక్షిస్తాయి. మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్‌తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి. logo