ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Jun 09, 2020 , 00:36:43

ఆస్తమాకు కొత్త మందు

ఆస్తమాకు కొత్త మందు

ఆస్తమా రోగులకు గుడ్‌న్యూస్‌ చెబుతున్నారు స్వీడన్‌ పరిశోధకులు. ఉబ్బస వ్యాధితో పాటు సీవోపీడీ లాంటి ఊపిరితిత్తుల సమస్యలకు కూడా ఈ మందు చక్కని పరిష్కారాన్ని చూపనున్నది. ఇప్పటివరకూ ఆస్తమా పేషెంట్లకు ఇన్‌హేలర్లే కొంత ఉపశమనం. కానీ వీటికి పూర్తిగా అలవాటుపడి పోతామన్న భయంతో చాలామంది వాడకాన్ని ఆపేస్తుంటారు. అందులో స్టిరాయిడ్స్‌ ఉంటాయని ఆందోళన పడుతుంటారు. అదో అపోహేనని డాక్టర్లు చెప్పినా వినడం లేదు. ఇలాంటి వాళ్లకు ఈ మందు మంచి ఉపశమనం. ఒక కొత్త ప్రొటీన్‌ నుంచి ఈ ఔషధాన్ని తయారుచేయనున్నారు. కెరొలిన్‌ స్కా ఇనిస్టిట్యూట్‌కి చెందిన సైంటిస్టులు స్టాక్‌హామ్‌ యూనివర్సిటీ, టెక్సాస్‌ మెడికల్‌ బ్రాంచ్‌లతో కలిసి చేసిన పరిశోధనే ఇందుకు బీజం వేసింది. క్యాన్సర్‌ చికిత్సల కోసం చేస్తున్న పరిశోధనలో. ఈ ఆస్తమా మందు యాదృచ్ఛికంగా వెలుగులోకి వచ్చింది. ఎలుకలపై మంచి ఫలితాలను ఇచ్చింది. మనుషుల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాల్సి ఉంది. logo