శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jun 06, 2020 , 00:21:22

రాత్రి పూట చపాతీ తింటే ఇవి తప్పక చేయాలి...

రాత్రి పూట చపాతీ తింటే ఇవి తప్పక చేయాలి...

ఊబకాయంతో బాధపడుతున్న వారు, లావు తగ్గాలని కోరుకుంటున్న వారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్దతి. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సలహాలిస్తున్నారు .  దీంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు. కాకపోతే చపాతి తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చపాతిని చాలా తక్కువ నూనేతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనే వేయకుంటే మరింత మంచిది. ప్లేట్‌ నిండుగా భోజనం చేసినా ఒకటే, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితం అయ్యింది.

శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతిల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. ఎందుకంటే గోదుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. వాటిల్లో ఎక్కువగా విటమిన్‌ బి, ఇ, కాపర్‌, అయోడిన్‌, జింక్‌, మాంగనీస్‌, సిలికాన్‌, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోదుమల్లో ఐరన్‌ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. పని ఒత్తిడిలో ఏ అర్దరాత్రో భోజనం చేసి వెంటనే నిద్రిస్తారు .  కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి,నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. చపాతి కూడా ఎక్కువగా తినకూడదు. ప్రతి రోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


logo