శనివారం 04 జూలై 2020
Health - Jun 05, 2020 , 21:40:10

ఇంట్లోకి బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి...

ఇంట్లోకి బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి...

బల్లి ఊరికే మీ ఇంట్లోకి రాదు .మీ ఇంట్లో తలదాచుకునే అవకాశం దానికి ఉంటేనే మీ ఇంటిలోకి వస్తుంది.అంటే చెత్తచెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు బల్లిని లోనికి రమ్మని ఆహ్వానిస్తుంది అన్నమాట.కాబట్టి సెల్ఫ్ కాని, స్టోర్ కాని, క్లీన్ గా ఉందో లేదో చూసుకోవాలి. వ్యాక్యూమ్ క్లీనర్ తో ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, ఫర్నీచర్ ఎప్పటికప్పుడు దులుపుతూ ఉండండి, వాటిని అటుఇటు జరుపుతూ క్లీన్ చేయండి, పాత పేపర్లు, మ్యాగజీన్లలో కూడా బల్లిలు దాక్కుంటాయి గమనించండి, ఇంటి వాతావరణం శుభ్రంగా చల్లగా ఉండేలా చూసుకోండి.ఎందుకంటే వేడి ఎక్కువ ఉన్నచోటే బల్లులు ఎక్కువుంటాయి. కేవలం బల్లులే కాదు, సిట్రస్ జాతి అంటే ఏ పురుగుకి పడదు.ఇవి సిట్రస్ ఫలాల్ని కాని, ఆకులని కాని, గ్రాస్ ని కాని, అసహ్యించుకుంటాయి.  లెమన్ గ్రాస్ ని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి.ఆ వాసన వాటికి పడదు.లేదంటే లెమన్ గ్రాస్ ని ఆయిల్ లో ముంచి ఎక్కడైతే బల్లులు దర్శనమిస్తున్నాయో, అక్కడ కొన్ని చుక్కలు పోయండి. అలా కాదు అంటే లెమన్ గ్రాస్ ని అక్కడే వెలాడదీయండి.  కర్పూరం వాసన మనుషులకి ఇష్టం కాని బల్లులకి ఇష్టం లేదు.అవి వాటికి ఎలర్జీని కలిగించనట్టు ఫీల్ అవుతాయట. కర్పూరానికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయట.ఇంకేం, కర్పూరం బిళ్లలు తీసుకోని బల్లులు వచ్చే చోటు దగ్గరే కాదు, ఇంట్లో అక్కడక్కడ పెట్టండి. 


logo