శుక్రవారం 03 జూలై 2020
Health - Jun 05, 2020 , 14:16:06

ఫ్రెంచ్ ఫ్రైస్ తో అనర్థాలేంటో తెలుసా ?

ఫ్రెంచ్ ఫ్రైస్ తో అనర్థాలేంటో తెలుసా ?

ఫ్రెంచ్ ఫ్రైస్...  ఈ పేరు వినగానే నోరూరుతుంది. అమెరికాలో ఫేమస్ ఫుడ్. ఇవి ఏంటో రుచిగా ఉంటాయి. నోట్లో కరకరలాడతాయి. అలాగని రోజూ వీటిని తినకూడదు. తింటే అనేక రుగ్మతలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోషకాహార నిపుణులు.. చెబుతున్నారు. ఫ్రెంచ్ ఫ్రైలలో పిండి పదార్థాలు ఎక్కువ. వీటిని ఆయిల్‌లో ప్రాసెస్ చేయడం వల్ల ఈ పిండి పదార్థాలు మన నోటికి బాగుంటాయి గానీ... శరీరానికి హాని చేస్తాయి. ఇవి త్వరగా జీర్ణం కావు . రోజూ తినడం వల్ల పిండిపదార్థాలు బాడీలో పేరుకుపోయి... బరువు పెరుగుతారు. 

ఫ్రెంచ్ ఫ్రైలను ఆరోగ్యానికి హాని చేసే ట్రాన్స్ ఫాట్స్‌లో ముంచి తీస్తారు. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తారు. ఫలితంగా వాటిని తిన్నవారికి బ్యాడ్ కొలెస్ట్రాల్ శరీరం లో తయారై... క్రమంగా అంది గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది.  తరచుగా ఫ్రై చేసిన ఆహారం తింటే... టైప్ -2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు తేల్చారు. ఫ్రెంచ్ ఫ్రైలను రోజూ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు డాక్టర్లు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఇది రుజువైంది. బంగాళాదుంపలను ఎక్కువ వేడిలో ఉడికిస్తే వాటిలో చక్కెర (పిండి పదార్థం)... అక్రిలామైడ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది గ్లిసిడమైడ్‌గా మారి... మన DNA నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా క్యాన్సర్ వచ్చేందుకు కారణమవుతుంది.  ఫ్రెంచ్ ఫ్రైలలో అక్రిలామైడ్ ఉంటుంది. అది మెదడులోని నరాలను దెబ్బతీస్తుంది. నరాల బలహీనత కు దారితీస్తుంది. క్రమంగా ఇది న్యూరోడీజనరేటివ్ (మెదడులో నరాల సమస్య) వ్యాధికి దారితీస్తుందట. logo