సోమవారం 06 జూలై 2020
Health - Jun 03, 2020 , 19:26:14

కొబ్బరితో ప్రయోజనాలివిగో...

 కొబ్బరితో  ప్రయోజనాలివిగో...

పచ్చి కొబ్బరి నుంచి తీసిన పాలు అలసటను తగ్గించడంలో ఎంతో ఉపకరిస్తాయి. అటుకులు, కొబ్బరిపాలు, బెల్లం కలిపిన బలవర్ధకమైన ఆహారాన్ని మూడేండ్ల  వయసు నుంచి పెరిగే పిల్లలకు ఇస్తే మంచిదని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు. పచ్చి కొబ్బరి నుంచి తీసిన నూనె తాగితే క్షయ వ్యాధి తగ్గుతుందట. ఎండు కొబ్బరి నుంచి తీసిన నూనెతో తలకు సంబంధించిన అనేక వ్యాధులు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నూనెను నోటిలో వేసుకొని కాసేపు పుక్కలిస్తే దంత వ్యాధులు తగ్గుతాయి.

కొబ్బరి నూనె తరచు రాయడంతో జట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు వంటి సమస్యలు దరి చేరవు. మార్కెట్‌లో దొరికే నూనెల కంటే స్వయంగా మనమే తయారు చేసుకోవడం లేదా తయారీదారుల వద్ద కొని ఉపయోగించడం శేయస్కరం. చెట్టుమీద బాగా ముదిరి కురిడి కట్టిన కాయను ఆహారంలో అప్పుడప్పుడు చేర్చుకోవడంతో దానిలోని చమురు కారణంగా పొత్తి కడుపు శుభ్రం అవుతుంది. అలాగే వాతాన్ని హరిస్తుంది. దేహపుట్టి అధికంగా కలుగుతున్న కారణంగా కేరళలో కురిడి కాయల నూనెను వంట నూనెగా ఉపయోగిస్తారు. కొబ్బరి పువ్వు సాధారణంగా అమ్మవారి పటాలకు ఆలకరణగా వాడుతారు. కొన్ని ప్రాంతాల్లో లేత కొబ్బరి పువ్వులను మిఠాయిల తయారీకి వాడుతారు. కొబ్బెరి బెల్లం కూడ ఆరోగ్యానికి మంచింది. కొబ్బరి పువ్వును మెత్తగా నూరి కరక్కాయ పరిమాణంలో రోజూ రెండు పూటలా పెరుగుతో కలిపి తాగితే మూత్రాశయంలో రాళ్ళు కరుగుతాయి. 


logo