సోమవారం 06 జూలై 2020
Health - Jun 03, 2020 , 01:37:17

వెక్కిళ్లు తగ్గాలంటే ... ఇలా చేయండి..

 వెక్కిళ్లు తగ్గాలంటే ... ఇలా చేయండి..

ఒకటి రెండు నిమిషాల్లో తగ్గిపోయే వెక్కిళ్లు సమస్య కాదు. కాకపోతే గంటలు, రోజుల తరబడి వెక్కిళ్లు కొనసాగితేనే పెద్ద సమస్యే. చాలాసార్లు కొన్ని నీళ్లు తాగగానే వెక్కిళ్లు తగ్గిపోతాయి. లేదా గట్టిగా గాలి పీల్చి మెల్లగా వదిలేసినా పోవచ్చు. కొంత మందికి అలర్జీ కారణంగా కూడా వెక్కిళ్లు రావచ్చు. అలాంటి వారికి అలర్జీ నివారణ చికిత్సలు అవసరం. మామూలుగా అయితే వీటిల్లో ఏదో ఒకటి అంటే ఉలవచారుగానీ, ఉలవ పప్పుగానీ తినేస్తే వెక్కిళ్లు తగ్గుతాయి. యాలకుల చూర్ణంలో తేనె కలిపి తీసుకున్నా వెక్కిళ్లు తగ్గుతాయి. వీటి ద్వారా తగ్గకపోతే ఆయుర్వేదం అందించే కొన్ని ఔషధాలు తీసుకోవచ్చు.సుకుమారామృతాన్నిపాలతో తీసుకున్నా వెక్కిళ్లు తగ్గుతాయి. 


logo