శనివారం 04 జూలై 2020
Health - Jun 02, 2020 , 23:48:49

పనసతో ప్రయోజనాలెన్నో...

  పనసతో ప్రయోజనాలెన్నో...


వేసవిలో లభించే ముఖ్యమైన పండు పనస.  పనస వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.పనస గింజలతో వేపుడు కూరలు, మసాల కూరలు చేసుకోవచ్చు. పనస పండు కోసిన తరువాత పైన గరుకుగా ఉండే పొట్టు లోపలి పీచును తీసివేసి మిగిలిన కండను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటితో తీపికూర, మసాలా కూర, పులుసు చేసుకోవచ్చు. పనస గింజల్లో పిండి పదార్థం అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పనసపొట్టు కూరతో పాటు పనస గింజలు కూడా కూరగా చేసుకోవచ్చు. విటమిన్ సి అధికంగా ఉన్న పనసలో క్యాలరీలతో పాటు మరెన్నో ఔషధగుణాలు ఉన్నాయట. పనస తొనలలో ఉండే జాక్ లైన్ పదార్థం రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుందట.   రోగ నిరోధక శక్తి  ఇందులో పుష్కలంగా  ఉంటుంది . 


logo