మంగళవారం 26 మే 2020
Health - May 23, 2020 , 15:01:48

శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టే సాల్ట్ థెరపీ....

శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టే సాల్ట్ థెరపీ....


సాల్ట్‌ రూమ్‌ థెరపీ పూర్తి సహజమైనదని, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది స్వస్థత చేకూరుస్తుందని నిపుణులు చెబు తున్నారు.  స్వల్ప పరిమాణంలో గాలి నిరంతరం సరఫరా అవుతున్న  గదిలో కూర్చున్న తర్వాత గాలిలో కలిసే ఉప్పు రేణువులు నాసిక ద్వారా లోపలికి వెళ్లిన అడ్డంకులను తొలగిస్తాయని బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయని వైద్యులు అంటున్నారు. మ్యూకస్‌ సాధారణంగా ప్రయాణించేలా చేసి అస్తమా ను నియంత్రిస్తాయని చెబుతున్నారు. అస్తమా, క్రానిక్‌ బ్రాంకైటిస్, సైనసైటిస్, అలర్జిక్, చర్మ వ్యాధులకు ఇది ఒక ప్రత్యామ్నాయచికిత్సగా పనిచేస్తుంది. ఫిట్‌నెస్‌ ఇంట్రెస్ట్‌ అధికంగా ఉన్నవాళ్లు హై ఇంటెన్సిటీ వర్కవుట్‌ చేసి అలసిపోయిన శరీరం మళ్లీ తిరిగి యథాతధ స్థితికి రావడానికి ఇది ఉపకరిస్తుంది.. మారథాన్‌ రన్నర్స్, క్రీడాకారులకు మాత్రమే కాకుండా సింగర్స్‌కి తమ గొంతు సమస్యల ను నివారిస్తుంది సాల్ట్‌ థెరపీ .


logo