గురువారం 01 అక్టోబర్ 2020
Health - May 14, 2020 , 18:01:11

ప్రకృతి సేద్యం నేర్చుకుంటున్న ఉపాసన

ప్రకృతి సేద్యం నేర్చుకుంటున్న ఉపాసన

మెగాస్టార్‌ చిరంజీవి కోడలు, రాంచరణ్‌ భార్య ఉపాసన సామాజిక అవగాహన కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. తన పనులతో సమాజాన్ని ఆలోచించేలా చేయడంలో ఉపాసన ఎంతో ముందుంటుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ప్రజల్లో, నెటిజన్లలో ఎంతో పాజిటివ్‌ అభిప్రాయాన్ని ఎర్పరుచుకుంది ఉపాసన. అయితే ఈ రోజు తాను తన తండ్రి అనిల్‌ రెడ్డితో కలిసి ప్రకృతి సేద్యం నేర్చుకుంటున్నట్లు ట్విట్టర్‌ వేధికగా ఫోటోలను కూడా షేర్‌ చేసింది. అంతే కాకుండా తన తండ్రిని ఆధునిక రైతుగా పేర్కొంది. అంతే కాకుండా పొలం పనుల్లో భాగంగా ఆవుకు దానా పెడుతూ, ఆవు  పేడను తీస్తూ  చెప్పడమే కాదు చేసి చూపెడతానన్నట్లు ఫోటోలను ట్వీట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఈ ట్వీట్‌ ద్వారా ప్రకృతి సిద్ద మంచి ఆహారం పట్ల అవగాహన పెంచుతుంది ఉపాసన.logo